పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

55


గుశీళ్లుగల దానిలో వేయవలయును. కచ్చేరీలోఁ జెల్లించిన దానిక రసీదు ఇచ్చెదరు. కొప్పెరలో వేసిన దానికి రసీదు లేదు. గాని రెండువిధములుగ చెల్లించినసొమ్ము దేవునకు చేరును. ఇది గాక యాత్రీకులొక వేళ సన్నిధిలోనికి దర్శనమునకు వెళ్లినపుడు, ఏమైనను సైకము వేయుదురను నుద్దేశముతో కుల శేఖరపడి అను కడపవద్ద ఒక చిన్నపెట్టె బీగములు శీళ్లుపైని రూపాయి పెట్టుటకు గంధ౸ము గలిగి సహరబః దోబస్తుతో ఉంచబడి యుండును. యాత్రికులు ఏముయిన వేసినంతట ఆడబ్బిలో వేయ వలయును గాని ఇతరత్ర ఇయ్యగూడదు. ఇట్లు హుండిలోను, చిన్న పెట్టెలోను వేయబడిన ముడుపులు పారుపత్యదార్ బావాజి, అసిస్టాంటు ట్రెజరరు, జియ్యంగారు, గుమస్తా ఎదుర నుండి హుండిని విప్పించి నాణ్యంవారిగ షరాబులు నెగై రా లచేఁ బారుపత్యదార్ ఏర్పాటు చేయించును. ఈనాణ్యములు ఏర్పరచి లెఖవ్రాయుట కే ప"ఖామణి యనిపేరు. ఇదివరలో దర్శనము అను హెడ్డింగులో సందర్భానుసారముగఁ జెప్పీన ప్రకారము ఈపరఖామణి ప్రతిదినమునాధారణముగా మధ్యాహ్నము ! ఘంటపై నుండి సాయంకాలము వరకు జరుగును. ఇది మఱుదిన ముదయమువరకు పారుపత్యదార్ కచ్చేరిలో నియ్యఁబడిన హారతి, అర్చన, వాహనము మొదలగు టిక్కెట్ల కు సొమ్ముముల్లెల (Bundles.) తోకూడ భద్రము చేయ బడి తిరుపతిలోనుండు దేవస్థానపు ట్రెజరీకి రవానా చేయఁబడి బంగారు వగైరాలు దేవస్థానపు విచారణకర్తలవారివలన యాలములో విక్రయింపఁబడును.