పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

53


అ ధ్యా య ము IV.

ప్రసాదములు.

ఇది దేవస్థానపు స్వంతము, ధర్మము, ఆర్జితమని మూఁ డువిధములు. ప్రతిరోజు మొదటిఘంట రెండవఘంటలకు ఈ మూఁడు విధంబుల నివేదన లుండవచ్చును గాని రాత్రిమాత్రము దేవస్థానపు స్వంతములో ఖర్చుపడిన నివేదనమాత్ర ముండును. మొదటిఘంటకు నివేదనయిన త్రివిధ ప్రసాదములలో దేవస్థానపు స్వంతమనునవి కయింకర్యపరులు మొదలగువారికి హోదాకు తగినట్టు మర్యాదలు చేయుటకును దేశాంతర బ్రాహ్మణాది వినియోగమునకును ఖర్చు పడును. ధర్మము అనఁగా ప్రతిదినము గాని కొన్ని రోజులలోఁగాని కొందఱు సామానులు ఇచ్చి ప్రసాదములు చేయించి ఆరగింపు చేయించెదరు. ఇది దేశాంతరులకు వినియోగము చేయవలసినది. హైదరాబాదు వరవర నరశింహరావుగారు, బెంగుళూరు శామన్న అనే శ్రీని వాసాచార్లుగారు, మైసూరు మహారాజుగారు, పుదుక్కోట రాజుగారు, సర్ తామస్ మన్రోదొరగారు మొదలగువార్ల ధర్మములు గలవు. సర్ తామాస్ మన్రోగారిధర్మము శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతాపమును దెలియఁ జేయక మానదు గదా! ఆర్జితమనఁగా యాత్రికులు సొమ్ము దేవస్థానము పారు పత్యదార్ కచ్చేరిలో చెల్లించి రసీదు తీసుకొని నివేదన చేయించిన ప్రసాదములు. ఇవి ఆరగింపు అయిన తఱువాఁత స్థలాచార ప్రకారము కొంచెము ప్రసాద మెత్తుకొని తక్కినది యాత్రికులకు నియ్యఁబడును. -