పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర. 49

గలవు గాని గురువారము రాత్రిమొదలు శుక్రవారపు సాయంకాలమువరకు ధర్మదర్శనము లేదు.

గురువారము.

గురువారపు మధ్యాహ్నము మొదటిఘంటకు ధర్మదర్శనమయిన తఱువాత తిరువాభరణము మొదలగునవి తీసి ఒకధోవతి ఉత్తరీయముమాత్రము శ్రీవారి మేనియందుంచి నేత్రాచ్చాదనముగనున్న పచ్చకర్పూరపు తిరుమణికాపు సన్నగింపఁబడును. తఱువాత మామూలు ప్రకారముగ రెండవ ఘంటకాఁగానే తలుపులు వేయఁబడును. తిరుగ సాయంకాలము తలుపులు తీసి శుద్ధిజేసిన పదంపడి యమునోత్తరయనఁబడుఁ బూలయఱనుండి తోమాలలు మేళతాళములతో తెచ్చి పూలంగియనే రాత్రీయలంకారమునకు వస్త్రాభరణంబుల నలంకరించి యుండ తోమాలశేవ, అర్చనఘంటయు నను నివి యవును. దీనికే పూలంగిసేవయని పేరు. పారుపత్యదార్ ఖచేరిలోషరాబువద్ద టిక్కెట్ 1-కి ఒక రూపాయి చొప్పున చెల్లించి పూలంగిదర్శనము టిక్కెట్లుకొని టిక్కెట్టు 1-కి ఒక మనిషి వంతునలోపలికి వెళ్లవచ్చును. వెళ్లునపుడు బంగారువాకిలి వద్ద తనిఖీ చేయుచున్న పారుపత్యదార్ వద్ద టిక్కెట్ ఇచ్చి శ్రీవారి దర్శనమునకు వెళ్లవలెను. పూలంగిదర్శనము ధర్మదర్శనము గాదు, ఈదర్శనమయిన తఱువాత శుద్ధి, తీర్మానము అవును. పూలంగిశేవ చేయించినవారికి పూలంగిదర్శనమునకు టిక్కెట్ కొననవసరము లేకుండగ కొంతమందిని లెఖ్క ప్రకారము వదలెదరు.