పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48 తిరుమల తిరుపతియాత్ర.

నిలచియుండవలెను. అప్పుడు సామానులు దేవస్థానమునుండి ఈయబడిన తరిగొండ వారిచే దేఁబడు ముత్యాలహారతి జరుగును. ఇతరహారతులను జేయరు. ఈహారతితట్టలో (అనగా పళ్లెరములో) రూపాయవేసినంతట దానిని జరిపించినట్టు భావము. ఆరూపాయ వెంటనే పారుపత్యదార్ వద్దకుఁ దేఁబడి దేవుని ఖజానాకుఁ జేరుటకు డబ్బీలో వేయఁబడును. హారతి అయిన తఱువాత పాలు, పండ్లు మొదలగునవి వినియోగము జేసి అందరిని బయటకు పంపి అర్చకులు, జియ్యంగారులు లేక నేకాంగులు సన్నిధిలో దివిటీపట్టు గొల్లలోపలనుండి తలుపులు వేసుకొని శోధనచేసుకొని బయటికేగెదరు, సన్నిధిలో కైంకర్వ పరులు బంగారు వాకిల బయటకు వచ్చినప్పుడు నిబంధన ప్రకాగము ఇప్పుడును బంగారువాకిలి హర్కారాశోధన చేసివదలును. అనంతరము బంగారు వాకిటికి బీగమువేసి మొహర్లు చేసి పారుపత్యదార్ బావాజి సహితముగా మొహరులు, బీగములు చూచుకొని ప్రాకారములలో నితరులు లేకుండగ జేసి పహరావాండ్రకు స్వాధీనపరచి పడికావలి తలుపులువేసి బయటికి వచ్చును.

ఈఏకాంతశేవలో శ్రీవారికి సమర్పణయిన చందనము మరుదినము దర్శనములో యాత్రికుల కిచ్చుటకు కొంతకల్పి పూసుకొనుటకు ఇయ్యబడును. కొంచె మర్చకులకుఁ జేరును. కొంతభాగము దేవస్థానము పొరుపత్యదార్ వద్దకు వెంబడి ధర్మార్ధము ఖర్చుపెట్టఁబడును. .

ఈప్రకారము ప్రతిదినము బీదసాదలయుపయోగార్థము ధర్మదర్శనములు, విశేషదర్శనములు త్రికాలములందును