పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

45


ధర్మదర్శనము.

దీనిని ఘంటదర్శనమనియు, మధ్యాహ్న దర్శనమనియు ననెదరు. ఉదయము విశ్వరూపదర్శనమువలె నిఉయు ధర్మదర్శనము. యాత్రికు లాతురపడక నిదానముగ దర్శనము చేసుకొనవలయును. దర్శన మందఱకయ్యే వరకు సమయముండును. కావున కొందరు దలాలీల (అనగా యాత్రికుల నాదరించువారివలె సంచరించువారు) దుర్భోధనలు విని సొమ్ము వృధాగా ఖర్చుపెట్టఁగూడదు. గుంపులో పో-శక్తులు పోరు పత్యదారుతో జెప్పుకొనినంతట సాధ్యమైనంత సౌకర్యము జేయించును.

ధర్మదర్శనకాలములో శ్రీవారి దర్శనమునకు లోపలికి వెళ్లినవారు తీర్థము శటారి మొదలగునవి అయిన తఱువాత వెంటనే బైటికి రావలెను. ఎవరికి వారు కొంచెము కాలములోపల నిలువబడి బయటికి రావడములో నాలస్యము జేసినంతట నహోరాత్రములు పనిజేసె నవుఖరులకును తమవలె దర్శనమునకు కాచియుండే యాత్రికులకును శ్రీవారి ముందు కార్యములకు నిబ్బంది గలుగును. గనుక నీ సంగతి ప్రతివారును గమనించవలెను. సాధారణముగా నీ ధర్మ దర్శనకాలములో హుండి విప్పి పరఖామణికి ప్రారంభము చేయుదురు.

ధర్మదర్శనమైన తఱువాత వచ్చు విశేష సేవలకు సొమ్ము జెల్లించి రసీదు తీసుకొనినవారు దర్మార్థముగా విశేష