పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

తిరుమల తిరుపతియాత్ర.

నిప్పుడును యాత్రీకు లెవరికి సొమ్ము లోపలనియ్యఁగూడదు. -ఈ సేవలు, ఉత్సనములు మొదలగువానికి టిక్కెట్ కును కచ్చేరిలో నిచ్చిన సొమ్ముతప్ప వేరేనియ్య నవసరము లేదు. ఇతర సేవలలోనటి హారతి టిక్కెట్ యాత్రికులు కచ్చేరిలో కొనుకోని సన్నిధిలో నిచ్చినంతట హారతి జరుగును. అనంత రము యాత్రికులు వెలుపలకురావలయును.

అర్చన, ఏకాంత సేవ, తోమాల సేవలకు సొమ్ము చెల్లిం చిన గృహస్థులను (బ్రహ్మోత్సవము నవరాత్సవము మొ దలగు విశేప దివసములుదప్ప) దేవస్థానమునుండి మనిషివచ్చి సేవకురమ్మని పిల్చును. ఆలస్యము చేసినంతట నిరీక్షింపరు. సేవ లకు టికెట్లు సేయువారు దిగిన జాగా గుర్తు బాగుగ జెప్పవ లెను. దేవస్థానపు మనిషి తనజాగాకు వచ్చినపుడు గృహ స్థులు లేనంతట "సేవలు వారికిగాను నిల్పఁబడవు.

తరువాత లఘుశుద్ధి ఆయి నీవేదనకుపోటు అనెడి వంటశాలనుండి పక్వపదార్థములుగల గంగాళము తెచ్చెదరు. ని వేదన కాలములో ఖచ్చేరి ప్రక్క–ననుండు రెండు పెద్దఘంటలు మోగించెదరు. ఇది సాధారణముగా మధ్యాహ్నము 12 ఘంటలప్పుడవను నివేదిసలనుగుఱించి “ ప్రసాదముల” నే హెడ్డింగ్ లో వ్రాయబడినది. ఈఘంటనిల్చిన తేఱువాత చుట్టు దేవత, లనఁగా పరీవార దేవతల కారగింపయి జియ్యంగార్లు మొదలగు కైంకర్యపరులు శాత్తు మొరకు లోపలకు వెళ్లి ద్రవిడ ప్రబం ధముఁ బూర్తిఁ జేసి తీర్జప్రసాదములగ దీసుకొని వచ్చిన తఱువాత ధర్మదర్శనమవును.