పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

తిరుమల తిరుపతి యాత్ర

నిజపాదదర్శన ప్రాప్తి గల్గును. శ్రీవారి కారాధనయయి తోమాలలచే నలంకరించెదరు. ఈ సేవలో వేదపారాయణము, ద్రవిడ ప్రబంధపారాయణము జరుగును. ఈకాలములో గద్వాల్ రాజుగారి నేతిదివిటీలు వెల్గును. హత్తీరాంజీమఠము యొక్కయు, మైసూర్ సంస్థానము యొక్కయు మనుష్యులు చామర కైంకర్యముఁ జేయుదురు. సేవాంత్యమున దేవస్థానపు హారతి ఒకటి అయిన తఱువాత గృహస్థుల హారతి టిక్కెట్లకు హారతి చేయఁబడును. వెంటనే యత్రికులు వెలుపలకు రావలెను.

కొలువు.

ఈపదమున కిచట దర్బార్ అనియర్ధము. శ్రీవారికులశేఖర పడివద్దనుండి వెండి ఖుర్చీలో శ్రీకొలువు శ్రీనివాసమూ ర్తివారు దేవస్థానముయొక్కయు, గద్వాల్ రాజుగారి యొక్కయు వెండి నెయ్యిదివిటీలు మండుచు ముందురాగా రంగమంటపము అనఁగా బంగారువాకిలి ముందుండు మంటపము లోనికి శఠారి సయితముగా విజయంచేయుదురు. శ్రీమైసూర్ మహారాజుగారిచే సమర్పింపబడిన బంగారుగొడుగు వారివల్ల నియమించబడిన బ్రాహ్మణునిచేఁ బట్టబడును. అప్పుడు లఘువు గానారాధన చేసి ర్పు 0-2-0లు రొఖము, 16 శేరుల బియ్యము నూనెయు నర్చకులకు దేవస్థానమునుండి దానమిచ్చెదరు. దేవస్థానమునుండి ఖర్చుపడు నువ్వులు, శొంఠి వేయించి పొడి చేసి బెల్లముతో కలిపి నివేదన చేయఁబడును. పంచాంగ శ్రవణ మయి గతదినపు చిఠా శ్రీవారికి (శ్రుతపరుపఁబ