పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

41


శుద్ధి.

పై దర్శనమయిన పిదప శుద్ధి చేయఁబడును. శుద్ధియనగా శుభ్రపరచుట. దీనికి నఱఘంట పట్టును. ఈసమయమున పాత్రలు, (Flooring), నట్టిల్లు బాగుగ శుద్ధిచేసి ముందు జరుగబోవు సేవకు పాత్రలలో నాకాశగంగ తీర్థము నింపి యుంచెదరు. ఈ సమయమునందు లోపలఁ బనిజేయు సేవకులు దప్ప నితరులు పోగూడదు.

తోమాలసేవ.

ఇది శుద్ధి అయిన వెంటనే ఆరంభమవును. ఇది శ్రీవారి కారాధనయై పుష్పమాలలు సమర్పించెడి సేవ, ఈ సేవఁ జేయించువారు దేవస్థానము పారుపత్యదార్ ఖచ్చేరిలో షరాబువద్ద ర్పు 13-0-0 లు చెల్లించి యొక టిక్కెటు తీసుకోనులయును. టిక్కెటు 1-కి అయిదుమంది వంతున వదలెదరు. హెచ్చువదలరు. శ్రీవారి బ్రహ్మోత్సవము, నవరాత్రోత్సవములలో మాత్రము నలుగురు వంతున వడలఁబడుదురు. అంతేగాక నమంత్రణోత్సవము, బ్రహ్మోత్సవము జరిపించుటకు రూపాయలు చెల్లించిన వారిని సాధారణ దివసములలో 10 మంది మొదలు తరగతివారి బ్రహ్మోత్సవమును బట్టి వదలెదరు. ఇట్లు సొమ్ము చెల్లించిన వారందఱు సేవారంభము మొద లంత్యమువరకునుండవలసినందున నొకప్పు డించుక జస స్తోమ మర్చన, ఏకాంతసేవలలోవలెఁ గల్గును గాన నట్టిస్తోమము లేకుండ దర్శనము గోరువారి మనోరధము సిద్ధించుట దుర్లభము. ఈ సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారి కభిషేకమగును. శ్రీమూలవరుల