పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

89


ధర్మ దర్శనమయినందున ఎంత మాత్రము సొమ్ము దర్శనమునకు ఖర్చు పెట్టనవసరము లేదు. ఒక్క వేళ దుర్భోధన చేయు వారుండిన యెడల దేవస్థానము పారు పత్య దార్ వద్దకు తీసుకొని వచ్చిన పక్షమున తగిన చర్య జరిపింప బడును. శ్రీవారికి హారతి చేయించగోరు వారు హారతి 1-కి 1-0-0 వంతున దేవస్థానం పారు పత్య దార్ కచ్చేరిలో షరాయి (shroff) వద్ద చెల్లించి హారతి చీటి పుచ్చుకొని సన్నిధికి వెళ్లినప్పుడు అచ్చట తండు అనగా గుంపులోపలకు బోకుండగ వేసిన కర్రలవద్ద నిల్చుండిన సన్నిధి హర్కారా అనే బ్రాహ్మణూని వద్ద నిచ్చిన హారతి చేయించును గాని టిక్కెట్టు కొనినంత మాత్రము చేత నాధిక్యత లేదు. ఈ విశ్వరూప దర్శన కాలము లో నిచ్చిన తీర్థము రాత్రి శ్రీవారికి బ్రహ్మారాధన చేసినది చాల విశేషముగ నెంచబడును. యాత్రస్థుల సంఖ్యను బట్టి ఘంట, లేక రెండు ఘంటలు విశ్వరూప దర్శన కాలమునకు నొసంగబడును. బంగారు వాకిలి లోగా [గర్భాలయమునకు మొదటి బయట వాకిలి] షరాయి ధరించిన వారిని వెళ్ళనియ్యరు. ఆయుధములు, చేతి కట్టెలు తోలు మొదలగు వాని ధరియించి యుండిన యెడల పడి కావలి లోనె వదలవలెను. అట్లు చేయని యెడల బంగారు వాకిలి లోగా వదలరు. ఘోషా స్త్రీలకు తోమాల సేవ అభిషేకము అర్చన ఏకాంత సేవ దర్శనములు దప్ప నితర దర్శన కాలములలో ముఖ్యులను మాత్రముంచి యితరులు లేకుండగ దర్శనము చేయిటకు విచారణ కర్తల వారు లేక పారుపత్య దార్ ఏర్పాటు చేయించుదురు. ఘోషా స్త్రీల మేనా లేక సవారి పడి కావలిలోపలనున్న రాయలు మంటపములో శ్రీకృష్ణదేవరాయ