పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

తిరుమల తిరుపతి యాత్ర.


భాతము జెప్పుచుండగ స్థలాచార ప్రకారము కైంకర్యపరులు తీర్థ ప్రసాదములను స్వీకరించెదరు. మంచము పరుపు మొదలగు సామానులు వెలుపలకు దేబడును. కొప్పెరయుగట్టబడును. ఈ లోపున కైకంర్య పరులు ఇతర బ్రాహ్మణులను సహా వదులుట దుర్లభము. స్త్రీలు మొదలగు వారి మాట చెప్పనవసరము లేదు. అనంతరము విశ్వరూప దర్శనమననే ధర్మ దర్శన ప్రారంభమయి శ్రీవారికి చెల్లించిన వారు మొదలగు కొందరిని ముందుగ గేట్ ద్వారా వదలి దర్శన మయిన తరువాత తడవకు కొంత మంది వంతున ప్రతి సారియు దర్శనమునకు నితరులను ఘంటల గేట్ ద్వారా వదలెదరు. గేట్ గుండా దేవస్థానపు వుద్యోగస్థుల ఉత్తరవు లేనిది అచ్చట నుండు పహరాజవాన్ లోపలకు వదలడు. ఈ సంగతి గమనించక గొందరు అచ్చట నుండు జవాన్ తో కొట్లాడెదరు. ఈ ప్రకారము ప్రతితడవ దర్శనమునకు కాచుకొని యున్న యాత్రికులకు శ్రీవారి దర్శనమవును. యాత్రికులలో గొందరు శిపర్శుజాబులు పారు పత్యదార్ మొదలగు తిరుమల వాసులకు దెచ్చెదరు. పారుపత్య దార్ కు గాక ఇతరులకు వచ్చు జాబులకును నతడె సౌకర్యము చేయవలసి యున్నది. వీరిలో కొందరు పత్రిక దెచ్చిన కారణ మాత్రము చేతనే తమకు బత్రిక గైకొను వారు భృత్యలని దలచి వేడినీళ్లు, కాపీ, భోజనము ఆవేళలందు దర్శనము పరుండుటకు పరుపులు, దిండ్లు ధర్మార్థము బసనిచ్చు ఖాళీ ఇండ్లు లేనప్పుడు గూడబడుగ లేకనే ఇండ్లు మొదలగు వానిని గోరి నిర్భందము జేయక ప్రవర్తించుట ఉత్తమము. జాబులు లేని వారికి సహితము తగినంత సౌకర్యము పారు పత్య దార్ చేయును. ఇది