పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

37

బసలు.

పై వివరించినవి గాక ధర్మార్థముగా బసలిచ్చు చిన్న ఇండ్లు గలవు. బాడుగలకును ఇండ్లు దొరకును.


అధ్యాయము. III.

శ్రీవారిదర్శనము.

దేవస్థానము యొక్క పడి కావలి యనెడి సింహ ద్వారపు తలుపులు ప్రాతఃకాలమున హరి కొలువను మంగళవాద్యమైన పిదప తెరబడి అర్చకులు వచ్చు వరకు యాత్రికులను లోనికి వెళ్లనివ్వరు. (అనగా లోపల తుడుచుట లేక ఊడ్చుట, శుద్ది చేయుట వగైరా పనులు అయ్యే వరకు అని అర్థము) ఉదయము 6, 7 ఘంటలకు దేవస్థానపు గర్భాలయము యొక్క బంగారు వాకిలి అనే మొదటి ద్వారపు తలుపులు తీయిబడును. అర్చకులు వచ్చునపుడందరికి తెలియునట్లు ఒక ఘంట వాయింపబడును. దేవస్థానము పారుపత్య దారు ఉత్తరువు ప్రకారము బంగారు వాకిలి తలుపులు తీసిన వెంటనే గొల్ల, అర్చకులు, జియ్యంగార్లు లోపలికెళ్లి తలుపులు మూసుకొని శయనమునకు విజయం చేసిన శ్రీవారిని యధాస్థానాసీనులుగ జేసి హత్తీరాంజీమఠము వారు తెచ్చిన ధారోష్టము పాలు ఆరగింపు చేసి తలుపులు తిరిగి తీసెదరు.అంతవరకు లోపల అర్చకులును జియ్యంగార్లును, బయట ఇతర కైంకర్యములును, సుప్రభాతమనెడు మంగళశ్లోకములను చెప్పు చుందురు. తరువాత తలుపులు తెరువ లోపలకు వెళ్లి సుప్ర