పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

33

నివేదన కూడ ప్రతిదినము శ్రీ వరాహస్వామి వారికి జరిగిన పిమ్మట శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరుగును. శ్రీవేంకటేశ్వరస్వామి వారిక్కడకు వచ్చినప్పుడు శ్రీవరాహస్వామివారు కలియుగము వచ్చుచున్నదని తెలిసికొని తన ప్రతాపమును తగ్గించుకొని “కలౌ వేంకటనాయకః” అనుటకు సరిగా శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సమస్తము నప్పగించెను.

ఘంట మంటపము.

ఇది వాహనమంటమ మానుకొని యున్నది. ఇందులో ఒక్క ఘంటగలదు. ఉదయము మధ్యాహ్నము అర్చకులు గుడికి వచ్చినప్పుడు అందఱికి తెలియునట్లు ఘంట కొట్టఁబడును.

పోలీసు స్టేషన్.

ఇది వెయ్యికాళ్లమంటపములో నున్నది. ఇక్కడకు తిరుపతి పోలీసుస్టేషనుకు టెలిఫోన్ కలదు.

పెద్దజియ్యంగారి మఠము.

యీమఠం వైష్ణవమతోద్ధారకులైన శ్రీరామానుజాచార్యులవారివల్ల నియమింపఁబడినది. ప్రస్తుతము శ్రీ అప్పన్ గోవింద రామానుజ పెద్దజియ్యంగారు వారు మఠాధిపతిగా యున్నారు. వీరు దేవస్థానంలో ననేక కైంకర్యములు నిత్యము చేయుచు దేవస్థానం నుండివచ్చు కొన్ని వరంబళ్ల ననుభవించుచున్నారు. ఈ కయింకర్యములు శ్రీ రామానుజులవారి నాట