పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

తిరుమల తిరుపతియాత్ర.

బ్రహ్మోత్సవములో వాహనమునకు ముందు లాగబడే బ్రహ్మరధము ఈ మంటపములో నున్నది.

బజారు.

శ్రీవారి మహద్వారమునకు ఇరుప్రక్కల యెదురుగను అంగళ్లుగలవు. ఇచ్చట బియ్యం కూరగాయలు వంట చెరుకు మొదలు సామానులు వెలకు దొరుకును. బియ్యము మొదలగు సామానులు కొను యాత్రికులు పాత్ర సామానుకూడ బాడుగకు ఇచ్చెదరు.

తీర్థగట్టుసందు.

శ్రీవారి దేవస్థానపు ఉత్తర ప్రాకారమానుకొని తీర్థగట్టుసందు అను పేర రాజబాటగలదు. ఇది పశ్చిమవీధిలో శంకరమఠమువద్దయు పశ్చిను ప్రాకారము నానుకొని దక్షిణపు వీధిలో కలియును. ఈసందులో తీర్థ పురోహితులయిండ్లు గలవు. ఇది శ్రీ స్వామి పుష్కరిణి గట్టు నానుకొనినసందు గనుక తీర్థగట్టుసందు అను పేరుగల్గె. గోసాయి మంటప మొకటి గలదు. శ్రీహత్తిరాంజీమఠంయొక్క మంచికట్టడములు గలవు.


శ్రీవరాహస్వామివారి దేవస్థానము.

ఈ దేవస్థానము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన మునకంటె పురాతనమయినదని పురాణములవల్ల తెలియు చున్నది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనమునకువచ్చు వారందఱు మొదట శ్రీ వరాహస్వామివారి దర్శనము జేసిన తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనము చేయవల్సినది.