పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

31

ఇది యీవీథిలోనున్నది. ఉత్తరపు వీధిలోనున్న శ్రీ వ్యాసరాయ స్వాములవారి మఠమువలె నిండా శిథిలముగ నుండక పోయినను మరమ్మతుకు తగినదిగా నున్నది.

2. శ్రీ పరకాళ స్వాములవారి మఠము.

ఇది నూతనకట్టడము. ఉత్తరపువీధిలో పడిపోయిన పాత మఠముయొక్క జాగాగలదు. నిత్యము కొంచెముమంది శ్రీ వైష్ణవులకు భోజనము పెట్టుదురు. ఇచ్చటను తదియారాధనలుగూడ జరుగును. ఇది వడహలమఠము. దేవస్థానమునుండి నిత్యము బియ్యము వగైరా సామాను లిచ్చెదరు.

రథము

ఇది కొయ్యతో చేయఁబడినది. ఇందు మంచికొయ్య పని చేయఁబడియున్నది. శ్రీవారి బ్రహ్మోత్సవములో ఇది చక్కగా అలంకరింపబడి 8వ దినమున ఉదయము శ్రీవారు విజయం చేయగా నాలుగు వీధులు మనుష్యులవల్ల లాగబడి తిరిగి యథా స్థానమునకు చేర్పఁబడును. తేరుకుచేరి ఒక రాతి మంఠపము గలదు. తేరుమీదకు వేంచేయుటకు ముందు శ్రీవార్లు యీ మంటపములో విచ్చేయుదురు.

దివాణము

తేరుకు సమీపమున నొక చిన్న కట్టడము. ఇది యాత్రికులకు తగినంత కారణంమీద బసగా నియ్యనగును. తేరుకు సమీపమున నిదియొక దేవస్థానపు కట్టడము.

వాహన మంటపము.

ఇదియొక రాతిమంటపము. శ్రీవారు వాహనారూఢులగుటకు ముందు వాహన మిచ్చట నుంచబడును. శ్రీవారి