పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

27

జమిందార్లు మొదలగు వారు తమ స్వాధీనము చేయవల్శినట్లుగోరి దరఖాస్తులు చేసికొనినను వారి కొసగక నీనుహంతు లకిచ్చిరి. ప్రస్తుతము ఈ మఠమునకు శ్రీమహంతు ప్రయాగ దాస్ జీగారు మహంతుగా నున్నారు. వీరి ప్రతినిధి (Representative) అధికారి అను హోదాలో సదా తీరుమల మఠం లోనుందురు.

శ్రీచిన్న జియ్యంగార్ల వారి మఠము.

దక్షిణపు వీధిలో చిన్న జియ్యంగార్ల (ప్రస్తుతము అప్పన్ శ్రీనివాస చిన్న జియ్యంగార్ల వారు) మఠము గలదు. తిరుపతిలోను శ్రీగోవిందరాజస్వామి వారి దేవస్థానమునకు సమీపమున ఈ మఠముగలదు. చిన్న జియ్యంగార్లు తిరుమల మీదనున్నప్పుడు కొందఱు వైష్ణవులకు భోజనము పెట్టెదరు. ఈ మఠము ముందు చెప్పబోవు పెద్ద జియ్యంగార్ల వారి మఠము నకు జేరినది, చిన్న జియ్యంగార్లు పెద్ద జియ్యంగార్ల వారి శిష్యులు. పెద్ద జియ్యంగార్ల వారు పరమపదము పొందిన తర్వాత చిన్న జియ్యంగారు వారిని నామఠమున కధిఱతిగా జేసెదరు శ్రీభాష్య కార్ల వారి పరంపరలోని పెద్ద జియ్యంగార్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానములో చేయు కైంకర్యములు అవిచ్ఛిన్నముగా జరుగుటకు ఈమఠం శ్రీభాష్యకార్ల పరంపరలో 10 వ పురుషుడైన శ్రీతిరువెంగడ రామానుజ పెద్ద జియ్యంగార్ వారి కాలములో మనవాళ మహామునుల సలహామీద నేర్పాటు చేయబడినది. చిన్న జియ్యంగార్ వారు ఇచ్చట నున్నప్పుడు తదీయారాధనలు యాత్రికులు కొందఱు చేయించెదరు. సొమ్ము