పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

తిరుమల తిరుపతియాత్ర.

ఈ మఠములో తక్కిన మఠములోవలే విశేషోత్సవము లనేకము జరుగును. వానిలో మఠము యొక్క మూల పురుషుడంతర్థానమైన జాగాయందు వారి సమాధి కట్టబడినది. వారు వేసుకొనిన ధూనినింకను ఆరిపోకుండ కాపాడబడు చున్నది, అచ్చటనొక మఠముయొక్క సాధువుచేత ఆంజనేయ కృష్ణ విగ్రహములకును సమాధులకును ప్రతిదినము ఆకశగంగ తీర్థము తులసి మొదలగు వానిచే పూజచేయ బడి కిచిడి మొదలగు వానితో నివేదన జరుగుచున్నది. యిది తిరుమలకు మైలు దూరమున పాపవినాశని ఆకాశ గంగకుపోవు మార్గములో నున్నది.

సాధారణముగా యాత్రికులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారియందెట్టి నమ్మిక గలదో అట్లనే శ్రీహత్తిరాంజీవారియందు మఠం శిష్యులకు నమ్మిక విశ్వాసములు గలిగి కానుకలిచ్చెదరు. శ్రీహత్తిరాంజీవారు స్వప్నములో శిష్యులకు కనఁబడి తమ ప్రార్ధనలకు నుత్తరువు నిచ్చుచుండునని శిష్యులనేకులు చెప్పు చుందురు. దక్షిణహిందూ దేశమందు హెచ్చు సంఖ్యగల సాధువులను గలిగిన మఠమిది యొకటియే.

శ్రీ మహంతు సేవాదాస్ జీవారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును బ్రిటిష్ గవర్నమెంటు స్వాధీనము నుంచి 1843 సం|| యేప్రియల్ తే 21 ది మద్రాసు గవర్నరు ప్రభువు గారి హుకుంను అనుసరించి జూలై తే 16 దిలో సంపాదించిరి. మనగవర్నమెంటు వారు దేవస్థానమును తమమేనేజిమెంటు నుండి ఇతరులకు నియ్య దలచు కొనునప్పుడు దేవస్థానములో నొక మిరాశిదార్ అయిన పెద్ద జియ్యంగార్ ఇంకను కొందరు