పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర.

25

డాల్ భాత్ ర్పు 30-0-0 + 3-8-0

ఖిచిడి (పొంగలి) 15-0-0

శీరా పూరీ. 60-0-0 + 3-8-0

మాల్ పూరి. 110-0-0 + 6-0-0

పంచ మీర్. 250-0-0 + 6-0-0

ఈ మఠములో గుడి దేవతార్చనలు గలవు. పూజారులు తెల్లవారు జామున 4, 5 గంటలకు లేచి స్నానము చేసుకొని పూజ చేయుదురు. ఈ గుడిలో సాలిగ్రామములు వందల కొలది గలవు. ఉదయము 6 గంటలకు బాల భోగము పొంగలిన్నీ మధ్యాహ్నము రాజ భోగమున్ను రాత్రి 8 గంటలకు తిరుగ నివేదనయు అగును. ఇచ్చట కర్పూర హారతిచేయించదలచిన వారు రు 1-4-0, వత్తి వెలగించి హారతి చేయించువారు రు 0-5-0 లున్నూ చెల్లించవలయును. ప్రతిదినము మధ్యాహ్నము 5 గంటలకు సాధువులకు ఒక్క పండితుడు సంస్కృతములో పురాణము చదివి హిందుస్థానీలో అర్థము చెప్పుచుండును. ఉదయము సాయంత్రము హారతి కాలమందు సాధువులు భజన చేయుదురు. ఈ మఠములో గాది అని వాడెడు సింహాసనములు గలవు. ఒకటి విజయనగరము రాజులకు నిర్మింపబడినది. రెండవది మఠము యొక్క మూల పురుషుని స్వంతమునై యున్నది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములో తేరుదినమునను మహంతు వారు ఉపవాస ముండి తేరు యధాస్థానమునకు వచ్చిన తర్వాత తేరువద్దనుండి మర్యాదతో దయచేసి పైన చెప్పిన గాదులం దాసీను లవుదురు.