పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

తిరుమల తిరుపతియాత్ర.

హాసనమును నింక రాజచిహ్నములగు నౌబత్ ఖానా ఘంట మొదలగునవి యిచ్చిరి. తిరుమలమీదనుండు రాజనగరు మఠముగా మారెను. వీరు జపముచేయుమాల యొకటి మఠములోకలదు.

ఈ మఠమునకు ఆదిస్థానము తిరుమల. శ్రీమహంతు వారు సంవత్సరములో కొంతకాలము తిరుపతిలో నుందురు. ఈ మఠమునకు తిరుచానూరు, చిత్తూరు, వేలూరు, షోలింగర్, వృద్ధాచలం, తంజావూరు, మధుర, నాసిక, పంచవటి, సుగూరు, బొంబాయి, భాగల్ కోట, కాన్పూరు జిల్లా, మున్జేరి జిల్లా, గుజరాట్, అయోధ్య, నాభా మొదలగు ప్రదేశములో శాఖలు కలవు.

తిరుమల తిరుపతి యందున్న నీమఠములలో నెంతమంది సాధువులు కయినను ఎన్ని దినములయినను బసయిచ్చి భోజన మిడెదరు. మరియు ననేకులకు సదావృత్తి నిచ్చెదరు. ఈ రెండు ప్రదేశములలోను పెక్కు సంఖ్య గల సాధువులు ప్రతి దినముందురు. శిష్యార్జితము కలదు. శిష్యులు పాదకానుకలకు నివేదనలకు సొమ్ము నిచ్చెదరు.

శ్లో. సతాంధనం సాధుభిరే నభుజ్యతే
దురాత్మ భిరుశ్చరితాత్మ నాంధనం
సుఖాదభి శ్చూత ఫలాది భుజ్యతే
భవంతినిం భాఃఖలుకాక భాజనం.

మఠమునకు శిష్యులు కానివారు సయితము పై శ్లోకార్థము ప్రకారము కొందరు సాధు సమారాధన మొదలగు వాటికి గాను సొమ్ము ఇచ్చెదరు. యిచ్చట నివేదనలు 5 విధములు.