పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

23

ములేదు. ఈమంటపము చాలభాగము యాత్రికులకొఱకు అరలుగా కట్టబడియున్నది. కొంతభాగము ధర్మశాలగా నున్నది. మంటపము యొక్క కొంతభాగము తగ్గుగాను కంబములన్నియు మోటుగాను మిగుల సమీపము గానుండుటవల్ల అంతబాగా తెలియదు. శ్రీవారిని వేంచేపు చేయుట కొక భక్తుఁడు దీనిని కట్టించినట్లు చెప్పుటయే కాని యెందుచేత వేంచేపు చేయుట లేదో కారణము తెలియదు.

4. శ్రీహత్తిరాంజీ మఠము.

ఆగ్నేయ మూల నెత్తైన స్థలమున నీమఠముకలదు. ఈ మఠమునకు మూలపురుషుఁడు శ్రీహత్తిరాంజీవారు. ఈయన వుత్తరహిందూ స్థానములో డిల్లీకి 24 మైళ్ల దూరములో నుండు కేడల్ క్రేల అను పురమునుండి వచ్చినవారు. వీరు అచ్చట మఠాధిపతియైన అనుభయనంద జీవారి శిష్యులలో నొకరు వీరు తీర్థయాత్రచేయుచు నీక్షేత్రమునకు వచ్చి తపస్సు చేయుచుండిరి. యిక్కాలమున విజయనగరం శాలువవంశపురాజు లీరాజ్యమును పాలించుచుండిరి. వీరును క్రీస్తుశకము 1500 సంవత్సరము లప్పుడు వచ్చినట్టు తెలియును. ఈయన మిగుల తపోనిష్టులు. వీరు శ్రీ వేంకటేశ్వరస్వామివారితో పాచిక లాడినట్లు చెప్పెదరు. వీరు ఆకులను భక్షించుచు నుదకము పానము చేయుచుండిరి. వీరికి జరామరణములు లేవనిన్నీ శరీరముతోనే కొంతకాములన కంతర్ధాన మయినట్లుగా చెప్పెదరు. వీరికి చంద్రగిరి రాజు తిమ్మ రాజుగారి కుమారుడు శిష్యుడై వీరి తర్వాత మఠాధిపతిగా వచ్చెను. ఈ రాచపుత్రుడు శ్రీహత్తిరాంజీ వారికి శిష్యుడగుటవల్ల అప్పటి రాజులు వీరి మఠమునకు ఒకసిం