పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. ధర్మశాల. (పిలిగ్రింషెడ్).

ఇది ఆళ్వారుచెరువువద్ద నున్నది. ఇది నూతనముగా యాత్రీకులు చెట్టుక్రింద వంటచేసుకొనకుండ వుండునట్లు నిర్మించబడినది. ఇదేమాదిరిగా గ్రామమున కుత్తరపుతట్టు ఒకటి కట్టబడినది వెయ్యికాళ్ల మంటపముపైన ఒకటి కట్టబడుచున్నది. ఈ మూడున్ను వేలకొలది బీదయాత్రీకుల కుపయోగము.