పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

17



శ్లో. శరీర మస్థిమాంసాద్యైః పూరితం పురుషఋషభః,
శ్లో. శరీరేన శరీరశ్చసంగమస్సాధ్వసంమతః,
తద్రాపిదివసక్రీడామ యుక్తామునయోవీదుః.
శ్లో. నికేతనే పితామాతా చాగ్నిహోత్రశ్చ దేవరాట్,
ప్రభాకర ప్రభాంపశ్యత్యజకామంద్విజాత్మజ.

ఈవచనంబులాలించి మాధవుఁడు భర్తమాటవినినంతట నీకు శ్రేయస్కరమేగాక పుత్రుఁడుబడయునని చెప్పి భర్తవాక్య పరిపాలన చేయని భార్యకు దోషంబుగల్గునని వక్కాణించెను. “నేను నీరంబుకొనుటకు మిషచేసరస్సునకుఁ బోయెద నీవు కుశా న్వేషణార్థము రమ్ము, అట నీకోరిక నెరనేర్చు కొనవచ్చును.” అని చంద్రలేఖ సరస్సున కేగెను. మాధవుడు దనమిషను సరస్సు రానచట వనములో ధవళవస్త్రము ధరించిన కోమలాంగి నొక తెనుగని భార్యనింటికిఁ బొమ్మన నామె నీరంబుగొనిపోయె. వనములోనుండు సుందరాంగిని విచారించ నిచ్ఛగలిగి “నీవెవరు? ఎచటనుండి వచ్చితివి? నీకులమేమి?” అని ఆమోహనాంగి నడుగుచు దనమనోభిమతంబు తెల్లంబు చేయ “నేను మధ్యదేశ ముననుండి వచ్చిన పంచమజాతి స్త్రీని మద్యమాంసములు భక్షించుదానను వ్యభిచారిణి కుంతలయను పేరఁబరఁగెద. వేద వేదాంగ వేత్తవు నీకు దండమొనర్చెద, నన్ను జూడ నీవనర్హుడవు, క్రీడింప నేల గోరెదవు” అని యా స్త్రీ చెప్ప “శ్రీమహావిష్ణువునకు మూఢుఁడైన పుత్రుఁడు గల్గినందుకు విచారము. బ్రహ్మకుకన్నులు లేవుగాఁ బోలు” అను మొదలుగాగల పలుకు చెప్పుచు దనకోరిక నీడేరవలెనను తలంపుగల్గ నాకుంతల తన్ను