పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

తిరుమల తిరుపతియాత్ర.

లోకము లల్లకల్లోలముకా నారంభించెఁగాని పర్వత రాజంబు చలింపదాయె. అతడు బహు కోపావిష్టుఁడై ఇంకను తన బలంబు జూపుచుండవలదని యింద్రాది దేవతలు వేడిరిగాని నతఁ డొప్పమి శేషుని వేడనతడు లోకారాఢ్యు నిచ్ఛనను గుణ్యముగా నింద్రాదుల కోరినటుల బంధనము నొకతలతో వీడ నాభూధరంబెగురహిమవద్గిరి తన పుత్రుని విసత్తుచూచి వాయు భగవానుని వేడనతడు స్వర్ణముఖరి సమీపముననుంచె. వాయుదేవుడు సహస్రాననునికపచారము గల్గించినట్టు తెలిసికొని క్షమాపణ గోరెను. శేషపరివృతమై శేషాంశము గల యీ పర్వతారాట్టునక దాది శేషా చలమని పేరుగల్గె.

(4) వెంకటాచలము.

కాళహస్తి నగరమునఁ బురంధర సోమయాజియను నామంబునఁ బరఁగు నొక విప్రుండుండెను. అతడు వేద వేదాంగ పారంగతుఁడయ్యి పుత్రుఁడు లేనందుకు ఖేదము నొందకుండెను. అంతనొక పుత్రుండుగల్గె. ఆబాలునకు మాధవుండని నామంబిడి విద్యాబుద్ధులు గరపుచుండెను. కుమారుఁడునుఁ దండ్రివలె వేదశాస్త్ర ప్రవీణుఁడై పుత్రరత్నమని పేరొందెను. పాండ్య దేశములో పుత్రికరత్నమని పేర్గాంచి చంద్రలేఖ యను బాలికను నీమాధవునకు వివాహంబు జేసిరి. వారు నిత్యమగ్ని హోత్రములు జర్పుచు కర్మాను ష్ఠానము లాచరించుచు వేదశాస్త్రములు పరిశీలన జేయుచు నుండిరి. “బుద్ధిః కర్మానుసారిణి” అనునట్లు ఒక నాడు మాధవుఁడు సూర్యాస్తమయ ముకాక పూర్వమె భార్యతో సంగమించ వలెనని గోర నామె ఇట్లు చెప్పె.