పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

15

అందుచేత నీ పర్వత రాజంబున కంజనాచలమని పేరుగల్గె.

(3) శేషాచలము.

శ్రీవైకుంఠములో శ్రీమహాలక్ష్మీసమేత శ్రీమన్నారాయణుం డంతఃపురముననుండ శేషుడొక స్వర్ణవేత్తనంబు హస్తంబునఁబూని ద్వారము నావలియుండ మహాబలుఁడగు వాయుదేవుఁడు భగవంతునిఁజూడ వేగముగానేతెంచుచుండ నీసర్పరాట్టు తన బెత్తముతోఁ బోవలదని నిరోధించెను. కార్యారముగ శ్రీవైకుంఠాధిపుని జూడవచ్చుచుండ నభ్యంతపర్చినందుకు కోపావిష్టుఁడై “పోవలదనుటకు హేతువేమిరాముర్ఖా” అని పలుకగా శేషుడు “లక్ష్మీవల్లభుడంతఃపురముననుండ నేనాజ్ఞానుసారము నిచటనున్నాను” అని ప్రత్యుత్తరమియ్య నామాటలాలించి “పూర్వము జయవిజయ లహంకారపూరితులై ఇట్లు నిరోధించినందుకు మునిపుంగవుల శాపంబుచే కుంభకర్న రావణాసురులయిరను సంగతి తెలియునా?” అని వాయుదేవుడు జెప్ప నిరువురకు వాగ్వాదములు ప్రబలమాయె. అంత లక్ష్మిచేఁ బ్రబోధ గావింపబడి శ్రీలక్ష్మీపతి “ఆగర్వితో నీకుఁ గలహమేమి?” అని వాయువుతో జెప్ప నతఁడూరకుండెనుగాని సర్పరాట్టుమాత్రము తనతో సమానము లేదనియు తాను బహుపరాక్రమశాలియనియు ప్రగల్భములు బలుక నాత్రివిక్రముడు “నావాఙ్మాత్రేణ పారుష్యంక్రియా కేవలముత్తమం. మేరుపుత్రుఁడైన ఆనందుడుత్తరభాగముననుండె. ఆనగంబున నొక్కరు గట్టిగా బంధించి యింకొకరు కదల్చినంతట బలాబలంబు లేర్పడును” అని యానతినియ్య నా సహస్రాననుండుబోయి చుట్టుకొని శిరంబుల గట్టిన బట్టుకొనెను. వాయుదేవుడు దన పరాక్రమంబు చూపుచుండ