పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

తిరుమల తిరుపతియాత్ర

మైళ్లు ఎక్కుడు లేక నుండును. అనంతరము మోకాళ్లెక్కుడు దిగుడుగలి తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు దయచేసి యున్న గ్రామము వరకు మార్గము తేలికగా నుండును. మోకాళ్లెక్కుడు దిగుడు అనున దొక పర్వతము దిగి యింకొక పర్వత మెక్కుట. అనగా నొక కనుమ దాటుట.

అలిపిరి అనగా కొండ పాదము. ఇచ్చట పాదరక్షలు గల మంటపము గలదు. ఈ పాదరక్షలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వనియు నిక్కడ మ్రొక్కి కానుక లొసగ వలెననియు యాత్రికులకుఁ జెప్పెదరు. ఇచ్చట శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ముడుపులు చెల్లింపఁ గూడదు, ఆట్లు చెల్లించిన యెడల శ్రీ స్వామి వారికిఁ జేరవు.

కొండ మార్గమున బిచ్చగాండ్రనేకులు గలరు గాని వాండ్ర వలన బిచ్చ మడుగుబాధ తప్ప నెట్టి బాధయుండదు. వీర్లలోఁ గొందఱు సాముద్రికము చెప్పునట్లును, మరికొందఱు కాళ్లుండియు లేనట్టుగుడ్డలు చుట్టుకొని నటించుచు నుందురు. ఇదంతయు దరిద్ర దోషముచే బిచ్చము కొఱకు వేషములు.

ఠాణాలు

శ్రీ లక్ష్మీ నృశింహ స్వామి వారి దేవస్థానం మొదలు భాష్య కార్ల గుడి వరకు ఎక్కుడు దిగుడు గలదు. ఇదియాత్రి కులకు కష్టముగా నుండును. అనగా ఒక్క పర్వతముదిగి ఇంకొక పర్వత మెక్కవలెను. ఈ రెండు పర్వతములకు మధ్యను కనుమకు అవాచారికొన యనిపేరు. ఇచ్చట యాత్రికుల క్షేమమునకు దేవస్థానము వారొక ఠాణా ఉంచి భటులను పెట్టియున్నారు. దీని కోన ఠాణా అనెదరు. ఇది తిరుపతికి 5