పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర

7

గుదుర్చుకొన వలెననీ పోవుచు మార్గములో డోలీలను హెచ్చరించి డోలి కుదుర్చుకొన వచ్చును. ఒకప్పుడు హెచ్చరించిన బేరము కుదరక పోయినను వాడు వెంటాడించు నంతట వేరే డోలివాడు సులభముగా రాఁడు. డోలి కుదిరిన తర్వాత కూర్చుండఁ బెట్టుకొని కొండ దూరము తీసికొని వెళ్లి అదుగో కొండయనియు నొకప్పు డింతవరకె డోలిలో తీసికొని వచ్చుట కేర్పర్చు కొనెననియు, సొమ్ము తెమ్మనియు కొండకు వెళ్లి వచ్చి నంతట నింకను సొమ్మియ్య వలెననియు డోలి వాండ్రు కొందఱు చెప్పుట తఱచు. ఇట్లు చిక్కులు పడకుండగ నేర్పరుచుకొనవలెను. లేదా యాత్రికులు దిగిన సత్రము గుమాస్తాల ద్వారా లేదా యాత్రికుల నాదరించు వారి ద్వారా యేర్పాటు చేసికొనవలెను. ఉదయము డోలీలు దొరకును. మధ్యాహ్నము కొండకుఁ బోవుటకు తిరుపతిలో డోలీ దొరకుట దుస్తరము.

సామానులు మోయుటకు బిడ్డలనెత్తుకుని వెళ్లుటకు కూలీలు దొరకుదురు. వీర్లను మూటలవాండ్రందరు. మనిషి 1_కి ర్పు 0-8-0 చొప్పున కూలి తీసికొనెదరు. వీర్లను యాత్రికులు కూడ తీసికొని వెళ్ళవలెను. బిడ్డలను విలువగల సామానులను మీడ్రవద్దనిచ్చి కూడా రమ్మనవలెను గాని దూరముగా నుంచుట నంత క్షేమకరము గాదు.

6. కొండమార్గము

తిరుపతినుండి కొండకు పోవు మార్గమున కలిపిరి రస్తాయనియు తిరుపతిరస్తాయనియు వాడెదరు. ఇది సుమారు ఏడు మైళ్ళ దూరము గలదు. మొదటి కొండ నెక్కుట నిండాకష్టము. తర్వాత ఒక మైలు కొంచెము కష్టముగానుండి యటుపైన రెండు