పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

తిరుమల తిరుపతియాత్ర



శ్లో||పితృశ్రాద్ధం పిండదానం ముక్తిస్తస్యనసంశయః|
మృత్పిండ కృతవాంవిప్రఃపుణ్యక్షేత్రే పురాతనే||
శ్లో|| కింవర్ణ యామఃపురుషోత్తమ, స్య
క్షేత్రస్యతీర్థస్యచపుణ్యశక్తిమ్,
మృత్పిండదానా త్పితరశ్చ తస్య
ముక్తిం ప్రపన్నాముర వైరిశాసనాత్

భవిష్యోత్తర పురాణము.

ఈతీర్థ సమీపమున నమ్మాళ్వార్ దేవస్థానము గలదు. ఇది శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవస్థానమువలె వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సంబంధించినది కాదు. ఈ తీర్థము వైష్ణవు లాళ్వారు తీర్థమందురు.

5. డోలి. మూటల వాండ్రు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనమునకు గొండ నెక్కలేని వారు డోలిలో వెళ్లెదరు. డోలి అనగా చిన్న ఉయ్యలతొట్టి వలె నొకచిన్న మంచమొక (ఒక అడుగు వెడల్పు రెండు అడుగులు పొడుగు) బొంగునకు వ్రేలాడకట్టి యిద్దఱచే మోయఁ బడునది. బుర్కా డోలి, మేనాసవారి దొరకును. డోలికి సాధారణముగా ర్పు 2-0-0 పుచ్చుకొని తిరుపతినుండి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఒక్క పర్లాంగు దూరమున నూరుబయట (కొండమీద) వరకు మోసెదరు. యాత్రికులు డోలీలను గుదుర్చుకొను నప్పుడు బాడుగ హెచ్చు గాకుండఁ జూడవలెను. ఇందులో కమీషన్ ఏజంట్లు గలరు, ఎవరి అవసరము లేకుండ కొండ మొదటికిఁ బోయ డోలీలను