పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర

3

నాల్గు జాతులవారికియ్యఁబడును. రయిల్వేస్టేషన్ వద్ద నుండి 2 లేక 3 అణాలకు బండి బాడుగ (అనగాఅద్దె) కు దొరకును. ఇది బజారుకుఁ జేరికొండకుఁ బోవుమార్గములో సున్నది.

మైసూరు గవర్నమెంటువారి సత్రము. క్రొత్తపల్లి రామాచార్లుగారి సత్రము రయిల్వే స్టేషన్ కు 4 ఫర్లాంగుల దూరమున నున్నవి. బండిబాడుగ స్టేషన్ నుండి రు 0-1-6 కూరగాయలు మార్కెట్ కు దగ్గఱగాను బజారుకు దూరముగాను శుభ్రముగను బందో బస్తుగనుండును. బ్రాహ్మణులకుమాత్రము బసలిచ్చెదరు. రామాచార్లుగారి సత్రములో పాత్రసామానులిచ్చెదరు. రెండుసత్రముల యొద్దను గుమాస్తాలుండెదరు. డాక్టర్ రామస్వామినాయుడు గారి సత్రము రయిల్వే స్టేషనుకు చేరి యున్నది. నాల్గుజూతులవారికి బసలిచ్చెదరు. నర్రావారిసత్రము పురమునకు పశ్చిమ భాగములో గలదు. నాల్గుజాతులవారు దిగవచ్చును.

శ్రీహత్తిరాంజి మఠమువారి ధర్మశాలపురమునకు మధ్య నున్నది. మార్కెట్ కు బజారుకు సమీపముననున్నది. నాల్గు జాతులవారు దిగవచ్చును.

వైశ్యుల సత్రములు క్రొత్తవీధిలో రెండుగలవు. సౌరాష్ట్రుల సత్రమొకటి శ్రీరాములవారి సన్నిధి వీధిలో గలదు.

N B: యాత్రికులు కూడ ఒక మంచి బీగము లేక కప్పు తాళము దెచ్చుకొనవలెను. డోలీలు సాధారణముగా ప్రతి సత్రమువద్ద దొరకును గాని పుష్పతోటవద్ద విశేషము,