పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర

127

వారి అడవికి ప్రాలద్రోలి శాస్త్రికి సహాయముగా సేన వచ్చు చున్నదని చెప్పుట నిజము కాదని తెలుసుకొని 10 మంది సోల్ జర్ లను విల్ క౯ వద్ద తిరుపతిలోనుంచి తాను బయలు దేరి వెళ్లెను. అనంతరం కొన్ని రోజులకు మట్ల వారి సహాయము వల్ల కరకం బాడి మారమత్తు చేయు చున్నారని విని విల్ క౯సైన్యము తోను, మందు గుండు సామానులుతోను కరకం బాడికి వెళ్లెను. గాని చచ్చేటట్టు గుండు దెబ్బలు తగుల డోలీలో సేనతో వాఫసు వచ్చెను. ఇట్లుండగా బసౌలత్ జంగ్ పెన్న నది దాటి పోలూరు కోట స్వాధీన పరచుకొని కాళాస్తి వరకు రాగా ఇంగ్లీషు సేనాని కాప్తా౯మూర్ సేనతో కాళాస్తి వద్దకు ఎదుర్కొనుటకు వచ్చెను. బంగారు యాచమనాయుడు దామెర్ల వెంకటప్ప నాయుడు సంపతి రావు వీర్ల ఒక్కొక్కరి వద్దను 40 వేల రూప్యములు కప్పము తీసుకొని ఫ్రెంచి వారు సహాయమునకు రారని తెలిసికొని తర్వాత వంద వాసి వద్ద కలతలు గ్రహించి ఇంగ్లీషు వారు సైన్యముతో వంద వాసి వద్ద నుండుట గని కర్ణాటకము నుండి పారి పోయిరి. తర్వాత సైన్యములన్ని వారి వారి ప్రదేశములు చేరెను.

ఈ దేవస్థానపు రాబడి ఈస్టిండియా కంపెనీ వారికి చేరుచు దేశపరిపాలన మాత్రము 1801 వరకు అర్కాడి నవాబులుదిగా నుండెను. అయితే 1782 మొదలు 1785 వరకున్ను 1790 మొదలు 1792 వరకున్ను నావాబులకు బదులు ఈ స్టిండియా కంపెనీ వారే దేశము పాలించు చుండిరి. 1801 జూలై 31-వ తేదీలో ఈస్డిండీయా కంపెనీ వారికి శాశ్వతముగా నవాబు వద్ద నుండి దేశపాలనంబు మారి నందున మహమ్మదీయ ప్రభుత్వం బంత మాయెను.