పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

తిరుమల తిరుపతి యాత్ర.

యెసగెను. తదాదిగా రాబడి మాత్రము ఇంగ్లీషు వారికి చేరు చుండెను. 1753 లో బ్రహ్మోత్సవమునకు ముందు ఈ దేవస్థానము స్వాధీనము చేసుకొన నిర్నయించి తిరుపతికి వచ్చిన మహమ్మద్ కోమాల్ ఇంగ్లీషు సేనాని ఓగిల్ బి మహమ్మదు సేనానీ జీబుల్లాఖాన్ వీరువర్ల వల్ల ఓడింప బడినందున దేవస్థానపు రాబడికి చలనము కలుగ లేదు.

1757 లో అతృప్తి చెందిన నజీబుల్లా ఖాన్ బ్రంహోత్సవమునకు వచ్చు యాత్రీకుల నుత్సవమునకు రాకుండ తన రాజ్యమైన నెల్లూరు మండలము నుండి వెనుకకు తరిమినందున బ్రహ్మోత్సవమునకు రాబడి తగ్గెను.

1758 లో నవాబు సహోదరుడైన అబ్దుల్ వహాబ్ ఖాన్ పాలేరు నదికి ఉత్తరముగా నున్న రాజ్యమునకు గవర్నరుగా నుండి రాజ్యము నందలి సొమ్ము వృధా ఖర్చు పెట్టి ధనము లేక నుండెను. తిరుపతి దేవస్థానమును ముట్టడించుటకు సేనను చేర్చు చుండెను గాని ఇంగ్లీషువారు సేనను పంపుచున్నారను వదంతిని విని ఆయత్నమును మాని చంద్ర గిరి నాక్రమించెను. హైద్రాబాదు నుండి ఫ్ర్ంచి సేనాని బుస్సీ వచ్చు చు తిరుపతిలో మకాము చేసెను. నజీబుల్లా ఖాన్ తో ఫ్రెంచి నాయకుడగు మరోసినీ నెల్లూరు నుండి వచ్చి కలుసుకొనెను. చంద్రగిరి లో నుండిన అబ్దుల్ వహాబు కూడ చేరిరి. దేవస్థానపు యిజారా దారును ముట్టడించి దేవస్థానం సొమ్మును తీసుకొనిరి. దేవస్థానం తమ స్వాధీనము కాదని తెలుసుకొని అబ్దుల్ వహాబ్ వెడలి క్రమేణ ఇంగ్లీషు వారి స్నేహము చేసెను. ఫ్రెంచి వారు దేవస్థానపు యిజారా దార్ వద్దనుండి లక్ష రూపాయలు తీసి