పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

తిరుమల తిరుపతి యాత్ర.

ములు తీసుకొని రాజ్యమువదలెను. ఇట్లు పోతూర ఘోజీభా౯ నులే శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి విశేష నగలు సమర్పించిరను వదంతి. వారు సమర్పించిన నగలు యింకను భద్రముగా నుంచ బడి శ్రీ వారికి సమర్పణ అగుచున్నవి. ఈ నవాబువంశములో గృహకలతలు కలిగి ఒకరిని ఒకరు చంపుకొనిన తర్వాత, సైదు మహమ్మదల్లీఖా౯ అను పశివాడు నవాబుగా నిర్మింప బడి వంద వాసి కోటలో పెరుగుచుండెను. అంత డిల్లీ పాదుషా క్రింద సుబాదార్ (గవర్నరు) గా హైద్రాబాద్ లో నుండిన నైజాముల్ ముల్ క్ అను వారు ఆర్కాడుకు వచ్చి రాజ్యము అరాచకముగా నుండుట గని మైనరు నవాబును అర్కాడులో తన నౌకర్ల సంరక్షణలో నుంచి హైద్రాబాదుకు పోయి ఏలూరు, రాజమహేంద్ర వరము, పరగణాలు పాలించు చుండిన తన నౌకరైన అన్ వారుద్దీన్ ఖాన్ ని నవాబు పని చూచుటకు నియమించిరి. మైనర్ నవాబును వీరి స్వాధీనములో నుంచెను. కొలది కాలములోనే మైనర్ నవాబు కొందరు నౌకర్ల వల్ల చంప బడగా అన్ వారుద్దీన్ ఖాన్, నైజాముల్ ముల్ క్ వల్ల నవాబుగా నియమింప బడెను. యితడికిన్నీ పూర్వపు నవాబు వంశమునకు సంబంధ పడిన ముఖ్యోద్యోగులలో నొకరుగా నుండిన చందా సాహేబునకు కలతలు కలిగెను. 1749 లో జరిగిన అంబూరు యుద్ధములో అన్ వారుద్దీన్ వీరి పెద్ద కుమారుడు మఫూజు ఖాన్ ఇరువరులు చంప బడగా రెండవ కుమారుడైన మహమ్మదలీ, తిరుచునాపల్లికి పారి పోయి ఇంగ్లీషు వారి సహాయము కోరెను. ఫ్రెంచి వారు చందా సాహెబు కు సహాయము గావించుచుండిరి. ఇట్లుండగా హైద్రాబాదులో 104 సంవత్సరముల వయస్సు గల నైజాముల్ ముల్ క్ చని