పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


116
తిరుమల తిరుపతియాత్ర.

చున్నది. నందవనములందలి అనేక మంటపమ'లు చూడనాకు గల్గిన సందేహము ఈశాసనంబువలన నివృత్తిగల్లెను.

హిందూరాజుల కాలములో శ్రీవారికిని వేదనలపరిమిత ముగానుండే నని ఇదివరలోనే చెప్పబడినెనుగదా! ఇంతనివేదనయు ఇప్పటివలెనేశ్రీవారికి ప్రతినిత్యము నియమిత కాలములయిన పగలు 2 సార్లు రాత్రి 2సార్లునివేదనఅగుచుండేనా? లేక ఇంకను హెచ్చు సార్లునివేదనగుచుండెనా? అని దేవస్థానవుఅనుభవముగలవారికి ఈసందేహముకలుగకమారదు. పూర్వము “అచ్యుత రాయులసంధి”అనికొన్ని గంగాళములునివేదన ప్రతినిత్యముగలదు. ఇదేమాదిరిగా అనేక రాజుల పేర్లలోఅనేక గంగాళములునివేదనగలవు. నంధిఅనగా నేమి? ఇప్పుడు రెండవఘంటకుని వేదన అయ్యెస్వల్పమైనచప్పిడి ప్రసాదము సంధి అనివాడబడుచున్నది.బ్రహోత్సవములుపోయి చక్రస్నానముమాత్రము మిగిలినట్టు సంధి అనీ కొంచము చప్పిడి ప్రసాదము ఆరగింపు మాత్రము నిలిచినది. సంధి అనగా రెండు కాలములుకూడు సమయము ఇక్కడ సేన లకుమధ్య కాలమునకు సంధీ అని చెప్పవచ్చును. ఆసంధి సమయనులో ఆరగింపు అయ్యే ప్రసాదములకు సంధి ప్రసాదము అని చెప్పుటకుబదులు సూక్ష్మముగా ఏరాజుసమర్పించిన ప్రసాదములు ఆ రాజు యొక్క సంధి అని పూర్వులు వాడినట్లున్నది. విశ్వరూప దర్శనమైనతర్వాత తోమాల సేవకు ప్రారంభము చేయబోవుకాలము, తోమాల సేవఅయికొల్వుకుముందు కాలము, కొల్వుఅయి అర్చనకుముందు కాలము, మధ్యాహ్నము ధర్మదర్శనముఅయి అర్చనకు ప్రారంభించబోవు కాలము, సాయంకాలముతలుపులుతీసిరాత్రితోమాల శేవకుముందుకాలము, తోమాల సేవ అయి అ