పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

111

హము, బాకు, రాజచిహ్నలుగా గలవారు. ఈవంశములో మొదటిరాజు వీరనరశింగరాయులు. ఈయన 1490-వ వత్సరములో రాజ్యమునకు వచ్చెను. ఈయన సంగమవంశకులలో నాఖేరు రాజువద్ద సేవకుడుగానుండి మోసకృత్యమువలన రాజ్యము సంపాదించెను. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానమును జీర్ణోద్ధారము చేసెను. ఈరాజు జీర్ణోద్ధారము చేసినట్టు దేవస్థానము ప్రాకారపు గోడమీద శాసనముగలదు. ఈయన చేయు జీర్ణోద్ధారములో పూర్వమువలె నెచ్చోటనుండు రాళ్లనచ్చోట సరిగా నుంచకపోమి ప్రాచీన శాసనంబులు నులభ్యంబులుగావయ్యె. గుడిప్రాకారముల మీదను, బంగారు మలాం చేయబడిన రాగిరేకుతో నాచ్ఛాదనంబయిన కట్టగల భావిమిదను సహా "వరాహము, బాకు "చిహ్నలు గల్గియున్నవి. వీరు ద్రావిడ దేశమునుకూడ కొంత లోబర్చుకొని చంద్రగిరివేలూరు పురములలో కోటలుగట్టిరి. వీరు శ్రీ వేంకశ్వరస్వామి వారిర్కి అయిదు గ్రామములు ఇచ్చినట్టు దిగువనుదహరింపబడు శాసనంబువలన ఏర్పడును.

11 280 of 1904 (అర్వము) శాలివాహన శతము 1889 సర్వజిత్ సంవత్సరములో గుండయ్య దేవ మహరాజు కుమారుడు సాలువరాజయిన నరశింగయ్యదేవ మహారాజు ఉడయరు దేవస్థానమునకు అయిదు గ్రామములిచ్చినట్టు మొదటి ప్రాకారము దక్షణపుగోడమీద శాసనముగలదు.

ఇంకొక శాసనము అనగా 10. 249 of 1904 అర్వభాష లో శాలివాహనశకము 1885 స్వభాను వత్సరములో నరసింగ రాయ ఉదయర్ యొక్క ఈవినిగురించి విస్తరించి చెప్పుచున్నది.