పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


110 తిరుమల తిరుపతియాత్ర.

19 B 712 of 1904 (అర్వము) పాండ్యరాజయిన జట వర్మన్ సుందరపాండ్య 1 గఱింంచిన శాసనము. వత్సరము అగపడలేదు.

19 D 174 of 1904 (అర్వము) యాదవరాయ వీరనరశింహదేవునినిగురించి శాసనము. వత్సరముసరిగా అగుపడ లేదు.

9 S 71 of 1889 (అర్వము) త్రిభువనచక్రవర్తి శ్రీ వీరనరశింహ దేనయాద రాయుని గుఱించి శాసనము.

పూర్వపు చరిత్రలు తెలిసినంతవరకు క్రీస్తుశకము 9వ శతాబ్దంత్యమువరకు కాంచీపురము రాజధానిగా పల్లవవంశస్థులు ఉత్తరార్కాట్ జిల్లా పాలించిరనియు తర్వాత ఉరయూర్ చోలవంశస్థులు మాల్కా హెడ్ రాష్ట్రకూటవంశస్థులు,తంజావూరులో గొప్ప చోలరాజయిన రాజరాజు దేవుడు, తుదకు విజయనగరం హిందూరాజులు పాలించిరని ఇంపీరియల్ గెజ టి౯ అయిదవ భాగము (Volume) లోనున్నందున నీ దేవస్థానము వీరందఱపాలసలో నుండెనని చెప్పుటకు సందియము లేదు. పురాణరీత్య అనాది అని చెప్పబడు శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానముయొక్క కాలనిర్నయము చేయుటకు చరిత్రలు పూర్ణమైన సహాయంబింకను నోసంగవు. అయినను క్రీస్తుశకమునకు చాలాపూర్వమనియు కాలనిర్నయంబు సరిగాచేయుటకింకను అవకాశము గలుగలేదనీయు రూఢిగ చెప్పవచ్చును.

సాలువ వంశము.

విజయనగరములో శివభక్తులైన సంగమవంశీకుల పాలనానంతరము సాలువవంశీకులువచ్చిరి. వీరువిష్ణుభక్తులు వరా