పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


109
తిరుమల తిరుపతియాత్ర.

అవుటకు కోన్నివత్సరంబులు పట్టును. అయినను దొరికినంత వర్కున్న శాసనంబులవలన నీ దేవస్థానమునకు చోలపాండ్య రాజులు కైంకర్యములు చేసినట్టు తెల్లంబు.

9. 1. 61 of 1889. (అర్వము) మొదట ప్రాకారములో నుత్తరపుగోడమీద కోనీర రాజరాజనరేంద్రవర్మ౯ యొక్క 16-వ వత్సరము లోనిది.

డాక్టర్ సువిశి_ అనువారు ఈ శాసనమున్ను, తర్వాత రెండు శాసనములున్ను నవీనమనియు, ఈ దేవస్థానమును జీర్ణోద్ధారము చేసిన సాలువవంశీపు రాజయిన వీరనరసింహదేవరాయుని కాలములో పూర్వ మున్న చోల శాసనములకు తప్పు ప్రతి అని అభిప్రాయ మిచ్చిరి.

9. J. 62 of 1889. (అర్వము). మొదటి ప్రాకార ముత్తరపు గోడమీద కోప్రత్ర మహేంద్రవరనుయొక్క 14వ వత్సరములోని శాసనము.

9 K. 68 of 1889. (అర్వము) మొదటి ప్రాకార ముత్తరపు గోడమీద కోపరత్నవరంయొక్క 14వ సంవత్సరములోని శాసనము.

9 L. 64 of 1889. (అర్వము) రాజరాజేంద్ర చోల దేవుని కాలములోని శాసనము.

17, 256 of 1904 లవంశములో నొక రాజు గురించి శాసనము.

19. C. 713 of 1904 (అర్వము) చోలవంశీపురాజయిన కులోత్తుంగ 1 గుఱింంచి శాసనము.