పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

తిరుమల తిరుపతియాత్ర.

మార్గస్థుల కిది మార్గములోను లేదు. ఈ కారణముల చేత వారికి వర్ణింప నవకాశము గలుగ లేదని ఊహించవలసినది.

"మణిమేఖల" అను గ్రంధములో ఈ దేవస్థానము గురించి చెప్పబడినది. ఇది క్రీస్తుశకమునకు రెండవశతాబ్దములో వ్రాయబడిన పుస్తకము.

ద్రవిడ ప్రబంధములో 9 ఆళ్వార్లు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురించి వర్ణించియున్నారు. అందులో పొయాళ్వార్ అనువారు క్రీస్తుశకమునకు అనేక శతాబ్దములకు పూర్వము ముందుండినవారు. వారు తిరుమలగురించి వర్ణించినారు.

తాళ్ శడై యుమ్ నీణ్ముడియుమేను మళువుమ్ శక్కరముమ్।
శూడారవుమ్ పొన్నాశోమ్ తోన్ఱుమాల్ శూడమ్।
తీరశ్డొరు విపాయుమ్ తిరుమలై మేలేన్క్కు।
ఇరశ్డొరువు మొన్నాయి శైన్దుకు।

శివకేశవ చిహ్నలు గలిగి ఇద్దఱు ఒక్కరయినట్టు వర్లీంచినారు. వీరి కాలములో మతద్వేషములు లేక సమ్మతముగా నుండవచ్చుననీ తోచెడిని.

ఈ దేవస్థానములో ప్రాకారములమీదనున్న శాసనములు పూర్తిగా బహిరంగము చేయుటకు శ్రీ విచారణకర్తల వారయిన శ్రీ మహంతు ప్రయాగ్ దాస్‌జీవారి వుత్తరవు ప్రశారము క్రీస్తుశకము 1922-వ సంవత్సరములో ఇట్టి శాసనములు ప్రచురమున కొకశాఖ నిర్మాణము చేసినందువలన నా శాఖవారు శాసనంబులు పరీక్షించి వ్రాయుచున్నారు. పూర్తి