పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

107


అధ్యాయము IX.


ఈ దేవస్థానములో ప్రసిద్ధికెక్కిన విజయనగరపు రాజులైన కృష్ణదేవరాయలు, వీరి ఇద్దఱుుభార్యలు, వీరి తమ్ముడు వెంకటపతి రాయలుయొక్క విగ్రహములు (Statues) తోదరు మల్లునిభార్య, మంత్రి, మంత్రిభార్యయొక్క విగ్రహములు (Statues) గలవు. ఇంకను రెండు గలవుగాని ఎవరో తెలియదు.

అక్బర్ చక్రవర్తి మంత్రి తోదర్ మల్లుయు ఇతనిభార్యయు శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులనియు, దేవస్థానమునకు మహోపకారము చేసిరనియు వదంతిగాని దృష్టాంతముగా శాసనముల రూపకముగా నింకను నేమియు గానము.

ఈ దేవస్థానము అనాది అనియు శ్రీమహావిష్ణువు శ్రీ వైకుంఠమునుండి దయచేసి రనుట పురాణప్రసిద్ధము. చరిత్రకారకులు ఈ దేవస్థానము గురించి ఏమి వ్రాసిరి అను మొదలగు సంగతులు వినుట కాహ్లాదకరముగా నుండును గాన కొంచె మీట వివారించెదను.

మెగస్తునీస్ ఫాహియా౯ మొదలగు కొందఱు ఈ దేవస్థానము గురించి వ్రాయలేదు. కాంచీపురము మొదలగు స్థలముల గురించి వ్రాసి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానము గురించి వ్రాయనందున నీ దేవస్థానము లేదనిగాదు, వీరు దేశమంతటయు తిరుగుచు వారు చూచినవి, వినినవి కొన్ని పురములు మొదలగునవి విశేషముగా వర్ణించిరి. ఈ పర్వతమునకు నాల్గుజాతుల హిందువులు తప్ప ఇతరులు వచ్చుటకు వీలులేనందున వారు యిచ్చటకు రాలేదు. వర్ణించను లేదు. అదీగాకపూర్వము