పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

తిరుమల తిరుపతియాత్ర.


నేను నీకు ప్రత్యకమయిన దివసమగు మకరమాస పుష్యమి నక్షత్రముతో కూడుకొనిన పొర్లమాస్య దివసమున తీర్ధములో స్నానముచేయు దేవతలు, మనుష్యులు మొదలగు వారికి సర్వపాపములు పోవును. ఇకమీదట నీతీర్థము రాను కృష్ణతీర్ధమని లోకములో ప్రఖ్యాతిజెంందును.

ఈ శుభ దినమున వందలకొలదీ జనులు స్నానమునకు తీర్ధమునకు వెళ్లెదరు. దేవస్థానమునుండి ప్రసాదములు మొదలగునవి పంపబడును. దేవస్థానం శిబ్బందీలు అర్చకులు మొదలగు వారందరు వెళ్లేదరు. అచ్చటనుండు కృష్ణవిగ్రహమునకు అభిషేకమయి దేవస్థానంనుండి తీసుకొనబడిన ప్రసాదము ఆరగింపయి వినియోగము జేయబడును.