పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


104
తిరుమల తిరుపతియాత్ర.

ఘోణతీర్ణమహిమ చెప్పనదిపిన నీకు ఈ రూపము బోవునని ఆనతిచ్చెను. ఆ ప్రకారమనేక వత్సరములా కోటరములోనుండెను. తుదకు అగస్త్య ఋషిశిష్యులసహా వేంకటాద్రికివచ్చి శ్రీస్వామిపుష్కరిణిలో స్నానమాచరించి శ్రీవరాహస్వామివా రిని, శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించి ఘోణతీర్థమునకుజని స్నానానంతరము పిప్పలి వృక్షనీడను కూర్చుండి శిష్యులకు ఘోణతీర్థ మహత్మ్యము వర్ణించెను. మండూకము ఋషి సాద కములకు నమస్కరింపనారీరూపము జెందెను. అంత నీవెవ్వ వని నౌమునిపుంగవుడడుగ పతివాక్యము మీరినందున నీగతి గలైనని అంతయు వెల్లడిచే సెను. అంత నామునిశ్రేష్ఠుండు "పతివాక్యంబు మీర రాదు. స్త్రీకి స్వతంత్రము లేదు. పతియే ఆత్మ, విష్ణు, బ్రహ్మ, శివుడు, గురువు, పతిపాదములుకడిగి ఆ తీర్ణములో స్నానము చేసిన గంగాదీనదులలో స్నానఫలంబుగల్లుటయేగాక శ్రీమహావిష్ణువునకు ప్రీతిగల్గును.” అను హితోప దేశముచేసెను. తుంబురునిభార్య ఇపముచే మాండూకు రూపొపమొంది ఘోణతీర్థమహత్మ్యమువలన తిరుగే నారీరూపముజెందెను. గనుక తుంబుర తీర్థమని పేరుగల్గెను. దీనినే తుంబుర ఘోణతీర్థమని వాడెదరు.

ఇచ్చట తరిగొండ వెంగమ్మను భక్తురాలు కొంత కాలము క్రిందట తపంబుసల్పిన తావు ఇంకను తెల్లంబు.

11. రామకృష్ణతీర్ధము.

శ్రీస్వామి పుష్కరిణికి ఉత్తరభాగములో నీ తీర్థము 6 మైళ్లదూరమునగలదు. ఇచ్చటకు కృష్ణుడను నోక మునితపన్సు చేసుకోనుచు నీ తీర్థము స్నానార్ధము కల్పించెను.