పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

తిరుమల తిరుపతియాత్ర.


10. ఘోణతీర్థము.

ఈ తీర్థము శ్రీ స్వామి పుష్కరిణి కుత్తర భాగమున పది మైళ్లదూరముననున్నది. ప్రదేశముచూడ బహు రమణీయముగ నుండును. ఇది దట్టమైన అరణ్యమద్యనున్నది. మినమాసములో నుత్తరఫల్గునీ నక్షత్రయుక్త పౌర్ణమాన్యదినమున నీతీర్థముక్కోటి. అచ్చట కప్పుడనేక జనంబు లేగి స్నాన జపభోజనాదులుగావించి సాయంకాలమునకు తిరుగ వచ్చెదరు. దేవస్థానమునుండి శ్రీవారీ కారగింపయిన ప్రసాద ములు చందనము తాంబూలము సహా అచ్చట కేగిన జనంబున కాహారమునకు పంపబడును.

శ్లో.

మీనసంస్ధసవితరిపొర్ణ మానీతిధౌధరే॥


శ్లో.

ఉత్తరపల్గునీయుకే చతుర్లైకాలసత్తమే.
పంఞ్చచనామపితీర్ధానాం తుమ్భేధగిరిగహ్వరే.॥


శ్లో.

యస్నాతిమనుజోదేవి పునర్గ నజాయతే.॥

ఇక్కాలమున చేసిన స్నానఫలంబు చెప్పనలవిగాదు. కోటికి న్యాదానములు గోదానములు మొదలగునవిచేసిన ఫలంబు ప్రాప్తించును. సమస్తపాపములను హరించును. ముక్తిని చ్చును.గంగాదీనదులలో స్నానంబొనర్చిన పుణ్యంబు సంప్రాప్తించును. అగ్నిష్ఠోమాది క్రతువులోనర్చిన ఫలంబు జేకురును. ఆరామచ్చెదనము, కన్యావిక్రయము, దేవద్రవ్యా