పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


97
తిరుమల తిరుపతియాత్ర.

ఆ బ్రాహ్మణుండు స్నానము జేయుచుండగా నారాజపుత్రుం డంతర్ధానయాయెను. తన్నువదలి రాజకుమారుడెక్కడకు బోయెనని విప్రుండు విలపించుచుండనంత నొక శబ్దము "ఓ బ్రాహ్మణుడా! శ్రీవెంకటేశ్వరకృపాకటాక్షము వలన నిహలోకములో నైశ్వర్యసుఖము నీవు బొందితివిగదా! నీ దేశమునకుబోయి భార్యాబిల్లలు సహీతముగానుండు. శరీరములో బలమున్నప్పుడే ధరము జేయుడి” అను మొదలగుహీతోపదేశము వెల్లడిచేసెను. దరిద్రపీడితుడైన నీవృద్ధబ్రాహ్మణునకి తీర్థస్నానమున కుమారత్వం ధనత్వం ప్రాప్తమాయెను. వృద్దుండిందలి స్నానము జేసిన మాత్రమున కౌమారదశబొందె నందున కుమారధారతీర్థమని పేరుగల్గెను. శ్రీకుమార స్వామి దేవసేనానిగానుండి దేవతల ప్రత్యర్ధముతారకాసురుని సంహరించి నందువలన బ్రహ్మహత్యా దోషము బోవుటకు నీతీర్థముల ప్రణవపూర్వక శ్రీ వేంకటేశాష్టాక్షర మంత్రము జపించుచు స్నానము జేసి నంతటా దోషము హరించునని పురంధరు డానతియ్య నాయనట్లు జేసినందున ఆదోషముబోయెను, ఒక్కకల్పము ఈతీర్థమువద్ద శ్రీకుమారస్వామి శ్రీవారి అనుజ్ఞ ప్రకారమున్నారు.

7. చక్రతీర్థము.

ఈతీర్థము తిరుమలకు రెండుమైళ్లదూరమున వాయవ్యమూలలో నున్నది. ఇచ్చట పూర్వము శ్రీవత్సగోత్రీకుడైన పద్మనాభుడను బ్రాహ్మణుండు జితేంద్రియుండై వత్రోతోదకంబులు భక్షీంచుచు 12 సంవత్సరంబులు ఘోరంబుగా తపంబా