పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

తిరుమల తిరుపతియాత్ర.

స్వర్ణముఖరీ సమీపమునబోయి చెంతనున్న శేషగిరిశిఖరమున కెక్కి. “బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలారా నవగ్రహాశ్వస్యాదులారా సర్వభూతములారా! నేనతీత దరిద్రపీడితుడై కుటుంబరక్షణ చేయ లేక నిహాలోక సుఖము లేక ధరాచరణన శక్తిచే పరలోక సుఖంబుగానక యున్నాను, వృద్దుడునై దరిద్రదోషహతుడగుట జన్మ వ్యయర్థంబు. పర్వతశిఖరంబుననుండి పత\బు చే ప్రాణత్యాగంబు దోషంబు లేదని పెద్దలు వచించిచెదరు. నేను పడుచున్నాను పడుచున్నాను పడుచున్నాను అనిపడ బోవుచుండ శ్రీవేంక 'కేశ్వరస్వామివారు మృగయార్ధమే తెంచిన నొక రాజపుత్రునిన లే దర్శనమిచ్చి పర్వతము క్రిందనుండీ “వలదు వలదు బ్రాహ్మణునకు భృగుపతనంబు దోషము పర్వతశిఖరంబు దిగిరమ్మ"నుచుజెప్ప నావీ ప్రుండు “ఓరాజు! నన్ను నాభార్యా బిడ్డలను గాపాడినంతట నేను దిగెదను” అని ప్రత్యుత్తరమియ్య “సర్వందదామి” అని రాజపుత్రుడె నతియ్య నా బ్రాహ్మణుడుదిగేను. ఆ ప్రభువృద్ధ బ్రాహణునికరము కర ముచే బూనితీసుకొని వెళ్లి "పాపనాశనమునకు కుత్తరముననున్న ఈతీర్థమున స్నానముచేయుము దుఃఖశాన్తియై కౌమారము వచ్చును” అని చెప్పెను.

శ్లో.

స్నానం కురు తతః ఖేద శాన్తిస్తత్ర భవిష్యతి।
ఇత్యుక్తె తత్ర తత్తీర్థే స్నాత్వోత్థాయ యువ భవత్॥


శ్లో.

మనః ప్రసన్న తాం యాతంకుమారశ్చత దాభవత్॥
తరంతు సర్వతః పశ్యంస్తమ దృష్ట్వా స్వ తప్యత॥

మార్కండేయపురాణము.