పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

95

6.కుమారధారతీర్ధము.

స్వామీ ఫ్రషరిణికి నుత్తరభాగమున మూడుమైళ్ల దూరమున పాపనాశనమును .ఈ తీర్ధమునకు వాయవ్యమూలను మూడుమైళ్ళ దూరమున కుమారధార తీర్థము గలదు. కుంభ రాశియందు రవియుండగా మఖనక్షత్రముతో కలిసిన మాఘశుద్ధపౌర్ణమి నాటిమధ్యాహ్నము ఈ తీర్ధములో స్నానము చేసినంతటి గంగాది సర్వతీర్ధస్నానముగావించిన ఫలము ప్రాప్తించి 12 సంవత్సరములుండును ఈ తీర్థమందేవరు దక్షణయుక్తముగా నన్న దానముగాని చందనటంబుల దానముగాని చేస్తారో వారి స్నానఫలము బొందెరు. ఈతీర్ధమువద్ద ఒక్క ఇనుపనిచ్చెనయాత్ర అంతము సౌఖర్యార్ధము వేయబడినది.

శ్లో.

   ... ... ... ....
తస్మి౯ తీర్ధ సర్ణ దానమణు మేరుసమంభ వేతం॥


శ్లో.

వస్త్రం దానంచ గోదానం భూదానం చ తతోథిమ్।
యో నాదదాతి మత్ప్రీత్యా తస్య లక్ష్మీర్గృహెస్థితా.॥

మార్కండేయపురాణము.

పూర్వకాలమున నొకానొక వృద్ధ బ్రాహ్మడుండెను. అతఁడు మిగుల దారిద్ర్యపీడుతుడై కుటుంబసంరక్షణ చేసుకోనలేక నుండెను. దరిద్ర దోషమువలన నిహపర సాధనములే మిగుల దుఃఖితుడుగా నుండెను. ఈకష్టము భరింపమి ఒకనాడు