పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ఆహాస్విద్వే టేశస్య మంత్రేణాష్టాక్షరేణ వై;
పిబేత్కటాహతీర్థం తాద్భుక్తిముక్తి ప్రదాయకఁ;

శ్లో.వినా మంత్రేణ యో వి ప్రస్సం పిబే తీర్ధము త్తమం;
పాపమేనాశయక్షిప్రం జన్మాంతర కృతంమహత్;

శ్లో. ఇత్యుక్త్వా న పిబేన్నిత్యం మోక్షమార్ధైక సాధనం;
స్వామిపుష్కరిణీ స్నానం వరాహ శ్రీశదర్శనం;

శ్లో.కటాహతీర్థ పానం చ  త్రయంత్రైలోక్య దుర్లభం;
బహునాకి మిహోక్తేన బ్రహ్మహత్యా దినాశకం;

స్కన్దపురాణము.

పూర్వము తుంగభద్రానదీతరమున వేదశాస్త్రపారంగతుడైన పద్మనాభశర్మ అనుబ్రాహ్మణోత్త ముండుగలడు. ఆయనకు కేశవర్మ అనుపుత్రుండు గలడు. ఆపుత్రుండు దల్లి దండ్రులను భార్యనుస్వకర్మలను వదలి జూదమాడుచు, సురాపానము జేయుచు, వేశ్యాంగనల నిండ్లభుజించుచు, గాలము గడుపుచుండెను. ద్రవ్యముకొఱకు దొంగతనము శేయుచు చేత ఖడ్గము బూని బ్రహ్మహ్యత లొనర్చుచుండెను. ఒ కేపుత్రుడిటుల దుష్కరుఁడయ్యెనని దుఃఖించుచు తండ్రి తుదకు భరద్వాజ ఋషికడకేగి నమస్కరించి జెప్పుచుకొనగవారు ఈతీర్థముపుచ్చు కొన్నంతటన్ని దోషములు పోవుననీ చెప్పనటుల నాబ్రహ్మణుఁడు పుత్రుని తీసుకొనివచ్చి శ్రీస్వామిపుష్కరిణి స్నానము గావించి శ్రీవరాహస్వామివారి దర్శనము చేయించి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకు తీసుకొని వెళ్లి విమాన ప్రదకుణంచేయించి తీర్థము పానంబుగావింప నాదుష్కర్మవిముక్తి గల్లెను.