పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

93

శ్లో. విప్రనిన్దాకృతాం చైవ ప్రాయశ్చిత్తం న విద్య తే|
విశ్వాసఘాతుకానాం చ కృతఘ్ననాం చ నిష్కృతిః ||

శ్లో. భ్రాతృభార్యా రతానాం చ ప్రాయిశ్చిత్తం నవిద్యతే|
తేషాం జాబాలితీర్ధేనై స్నానాచ్చుద్ధిర్భవిష్యతి||

5. కటహ తీర్థం.

గంగా నదికి దక్షిణభాగమున 200 ఆమడ (యోజనము) దూరమున తూర్పు సముద్రమునకు పంచభిర్యోజనచూరము పశ్చమముగా సుసర్ల ముఖీనదీ తీరమున ను త్తరముగా క్రోశడుదూరములో సమన్తులవలన నందింప బడు వెంకటాద్రిగలడు. ఆ వెంకటద్రీశుని మేరుపుత్రుడు దేవతలు ఋషులు మొదలగు వారు సాకేత్ శ్రీమన్నారాయణుడని పుజించెదరు.మోక్షప్రదాయకుడై శ్రీవెంకటేశ్వరుని చుట్టుకోని శ్రీమహాలక్ష్మీయు భూనీళా   దేవులున్నారు.అట్టి వెంకటేశుని ఆలయములో నుత్తరభాగమున విమాన ప్రదక్షణములో నున్నదనీ భారద్వాజ ఋషి చెప్పిరి. ఇందలి తీర్థమును స్పర్శదోషము లేకుండా బ్రహ్మకుక్షత్రియ వైశ్య శూద్రులు నాల్గుజాతుల వారు తీసుకొనేదరు. ఇందలి తీర్థపానము బ్రహ్మహత్యాది మహాదోషములను గూడ బోగోట్టీముక్తిదాయకముగనున్నది. నాల్గు ఆశ్రమములవారు ఇందలితీర్థము సేవించి ముక్తిబొందేరు. కుష్టు మొదలగు కర్మవ్యాధుల సహాపోగొట్టును.

శ్లో. స్మృతిమాత్రేణ యత్పూంసాం సర్వపాపనిషూదనం,
మంత్రేణాష్టాక్ష రేణై వపిబేతీర్థ మనోహరం.||

శ్లో. అధవా కేశ వాద్యైశ్చ నామభిర్వాపిజ్జలం,
యద్వానామత్రయేణాపి పిబెత్తిీీర్ధం శుభప్రదం.||