పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
88 తిరుమల తిరుపతియాత్ర.

వేంచేసి స్నానముగావించెదరు. అప్పుడు విశేషముగ జనముండి చక్రతాళ్వార్తోగూడా స్నానమొనర్చెదను.ఈ సమయమున సర్వతీర్థములందుండుననియు దేవతలందరచ్చట స్నానముచేసెదరని చెప్పెదరు.

శో.ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే|
ఆయా న్తి సర్వతీర్ధాని స్వామిపుష్కరిణీజ లే||

శ్లో.తత్ర స్నాత్వా సరస్సద్యోము క్తిమేతి న సంశయః|
యస్య జన్మసహస్రేషు పుణ్యమేవార్జితం పురా||

శ్లో.తస్యాస్నా నంభ వేద్వి ప్రానాన్యస్యత్వ కృతాత్మా నః|
విభవాసుగుణందానం కార్యం తత్ర యథావిధి||

శో.సాలగ్రామశిలాదానం గాం దద్యాచ్చవి శేషతః|
యే శృణ్వన్తి వ కథాం విష్ణో స్సదాభువనసానసమ్||

స్కన్దపురాణము.

శ్రీవైకుంఠ తీర్థము.

శ్రీ స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగమున రెండు మైళ్ల దురమున నొక గుహగలదు. దీని పేరు వైకుంఠ గుహ యని వాడెదరు. ఈగుహలోనుండి తీర్థము సదానచ్చుచుండును దీనిని వైకుంఠ తీర్థమనెదరు. శ్రీరాములవారు పంపానదీ దాటి వానర సైన్యముతో లంకకుఁ బోవుచున్నప్పుడు శ్రీ స్వామి పుష్కరిణి తీరమున నిల్చిరి. వానర బలపరాక్రమ శాలురైన గజ గవాక్ష గవయస్సర భగంధమాధ నాదులు, సింహతుల్య పరాక్రమశాలురు ఆగుహ ప్రవేశించిరి. కోటిసూర్య ప్రకాశ మానమైన నొక తేజస్సును, ఒక పట్టణమును జూచిరి.