పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

తిరుమల తిరుపతియాత్ర.

నది. గర్భాలయము అనఁగా బంగారువాకిలిదాటి వినూనప్రదక్షణములో దేవతలగు శ్రీయోగనృసింహస్వామి శ్రీవరదరాజ స్వామి దేస్థానములున్ను భక్తులగు శ్రీభాష్యకారులు, శ్రీ సేనాధిపతి, శ్రీగరుడాళ్వార్ల దేవస్థానములు గలవు. వంటశాలలో శ్రీవకుళమాలికా దేవిగడిగలదు. ధ్వజ స్తంభము వద్ద క్షేత్రపాలకశిలగలదు. ఇచ్చటనే అర్చకులు ఇంటికి వెళ్లునపుడున్ను దేవస్థానమునకు వచ్చునపుడున్ను బీగముచెవులు తాకించి వెళ్లవలెను. క్షేత్రపాలకులుపూర్ణకళతో గోగర్భమువద్దనున్నారు. వీరి ప్రభావము గుణించి అనేక కథలుగలవు.

26. ముద్రమండపం.

ఎవరయినను శ్రీవారిదేవస్థానములో తప్తాంకితముచేను కొనవలెనన నఫరు 1–కి ర్పు 0-12–4 పంతున పారుపత్యదార్ ఖచేరిలో చెల్లించినయెడల ఒక్క శ్రీవైష్ణవ బ్రాహణునిచే వారికి చక్రాంకితము కావింపబడును.

***

అధ్యాయము. VIII.

తీథ౯ములు.

ఈ పర్వతమున 360 తీర్థములుగలవనియు అందులో కొన్ని అంతర్థానమనియు, కొన్ని మిగుల కష్టసాధ్యమనియు చెప్పెదరు. యాత్రికులకు సులభ సాధ్యములగు తీర్థములు కొన్ని గలవు.

1.శ్రీస్వామిపుష్కరిణి.

ఈ తీరమునుగురించి అనేక పురాణములు బహు తెరంగుల వర్ణించినవి. ఏ పురాణములో జూచిననీతీర్థ మహాత్మ్య