పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

తిరుమల తిరుపతియాత్ర.

20. శ్రీరామస్వామి వారి దేవస్థానం.

ఈ దేవస్థానము తిరుపతిలో నున్నది. ఈ దేవస్థానము జాంబవంతుని ప్రతిష్ఠ అని చెప్పెదరు. యాత్రికు లిచ్చటకు దర్శనమునకు వెళ్లెదరు.

21. శ్రీపద్మావతి అమ్మవారి దేవస్థానం.

శ్రీశుకులు తపస్సు చేసుకొనుట చేత శుక పురి అని . పేరుగలినది. దానిని అరవముతో శుకనూరు అని వాడెదరు. దానికి వైష్ణవసిద్ధాంతపదమగు తిరుశబ్దము జేర్చి తిరు శుకునూరు అనివాడిరి. అదిక్రమేణ తిరుచానూరు అని వవాడబడు చున్నది. ఇది తిరుపతికి రెండుమూడుమైళ్ల దూరమున నున్నది. ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానము గలదు. శ్రీపద్మావతి అమ్మవారిని శ్రీఅలివేలు మంగమ్మ అనియు తిరుచానూరిని అలి వేలుమంగాపురమనిన్ని కొందఱు వాడెదరు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిదర్శనమునకు వచ్చు యాత్రికులు శ్రీస్వామివారి పత్నియగు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనమునకు తప్పక వెళ్లె దరు. సంవత్సరమున కొకసారి యేప్రిల్ నెలలో తెప్పోత్సవము జరుగును. అరవ కార్తి కినెలలో బహోత్సవము జరుగును. ఈ దేవస్థానములన్నియు శ్రీవెంక టేశ్వర స్వామివారి దేవస్థాన ముసకులోబడి తత్సంబంధమైన రాబడి మీద ప్రబలుచుండును.

22. తిరుమల అడవి.

తిరుమలమీద కొంతఅడవి శ్రీవారికి చెందుచున్నది. ఇదిగాక ప్రస్తుతపు శ్రీవిచారణకర్తలవారివలన రెండు తాలూకాలు ఖరీదు చేయబడినవి.