పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

83

16. బంగళ.

ఆళ్వార్ చెర్వు సమీషమున దేవస్థానమునకు సంబంధించినతోటలో బంగళా గలదు. దేవస్థానపు విచారణ కర్తల వారి ఉత్తరవు మీద యూరోపియన్లు వచ్చిలనచేయనచ్చును. బంగళాకు ప్రక్కనుండి చంద్రగిరికిపోవుమార్గము. ఈ బంగళా వెనుకనుండిచూచినంతట కొండలు లోయలు మొదలగు ప్రకృతి చిత్రములు ఆహ్లాదకరముగనుండును.

17. తరిగొండవెంగమ్మ.

తరిగొండ వారు శ్రీవారి దేవస్థానపు మిరాశిదార్లలో నొకరు. అందులో తరిగొండ వెంగమ్మ అనునామె చాలాభక్తురాలు. ఈమెకుఆంధ్రమునమంచి ప్రవీణతగలదు. ఈ మెసమాధి గ్రామమునకు నుత్తరపునే పునగలదు. అచ్చటకు స్థానికులు వెళ్లి చూచెదరు.

18. శానిటేషన్.

తిరుమల గ్రామముయొక్క శానిటేషన్ దేవస్థానము వారే చూచెదరు. అందుకు శానిటరి యిన్ స్పెక్టర్ మొదలగు వారు గలరు. దేవస్థానముడిస్ పెన్సరి ఒక్కటిగలదు. గోగర్భమునకు వెళ్లుత్రోవలోకలరాప్లేగుషెడ్లుగలవు.

19 శ్రీగోవిందరాజస్వామి వారి దేవస్థానం.

ఈ దేవస్థానము తిరుపతిలోగలదు. శ్రీగోవిందరాజస్వామి వారు శయనమూర్తి తిరుమల నుండి వచ్చుయాత్రికు లీ దేవస్థానములో శ్రీగోవిందరాజస్వామివారి దర్శనము చేసుకొనెదరు.