పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

తిరుమల తిరుపతియాత్ర.

మి తీర్థముక్కోటి దివసమున శ్రీతాయార్లు వారి సమర్పణకు తిరుమలనుండి పంపబడిసమర్పణయిన తర్వాత ఒక సంవత్సర మున కొకదివసము మానవులకు ప్రాప్తము. ఇతర కాలములలో శ్రీవారిప్రదక్షణములోని పూలభావిలో వేయబడును.

బంగారు భావిఅనునది శ్రీవారికి విమానస్రాకారములలోనున్నది. ఈతర్థము శ్రీ వారిసన్నిధిలోను, వంటశాలలోను నుపయోగము.

13. ఉగ్రాణము.

శ్రీవారివంటశాల సామానులు బియ్యము మొదలగు నవి యుంచు శాలకు ఉగ్రాణమని పేరు. ఇది విరజానది వద్ద నున్నది.

14. జ్వరగాలి.

ఇచ్చట వేసవి కాలమందు గాలీ హెచ్చుగవీచును. దీనిని జ్వరగాలి అనెదరు - శ్రావణ మాసములో తిరుమల గ్రామమునకు కనబడుచుండు నారాయణగిరి మీద శ్రీ వారి పాదములకు సంవత్సరమున కొక సారిపూజ జరుగును. అప్పుడు జ్వర గాలి తగ్గును.

15. నీటివసతి.

తిరుమల వీథులలో కొళాయిలు గలవు. తిరుమల గ్రామమునకు వెలుపల నెత్తైన ప్రదేశములో ఆళ్వార్ చెరువు అనెడి కోనేరుగలదు. అందలి తీర్థము కొళాయికి వచ్చును. ఇదిగాక భావులు గలవు, ఈ కోనేటిని హిందూస్థాన్ దేశస్థులు "సూర్యకుండు” అని వాడెదరు.