పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

తిరుమల తిరుపతియాత్ర.

మునకు సొమ్ము చెల్లించిన నితర యాత్రికునకును, శ్రీవారి పనులకును అభ్యంతరము గలుగును. కనుక వీలుపడదు. మేళము సకాలమునకు రాలేదని యాత్రికులు ఫిర్యాదు చేయఁగూడదు.

2. నిత్యహారతి.

శ్రీవారికి నిత్యము హారతి జరుగుటకు దేవస్థానము ఖచే రిలో నిత్యకర్పూర మంగళహారతికి రు 30 లున్ను, నిత్యనవనీత హారతికి రు 50_లున్ను చెల్లించిసంవత్సరము 1_కి ఇవిజరిపించుట కు గాను యాత్రికులు తను ఏజంటుకు సంవత్సరము 1–కి ఖచేరిలో చెల్లించినంత మొత్తనమిచ్చినంతట హారతి జరిపించును. లేనంతట శ్రీవిచారణకర్తలవారికి ఆర్జివ్రాసుకొని దేవస్థానము ద్వారా జరి పించుటకు ఏర్పాటు చేసుకొని నంతట వేఱే ఏజంటు లేకనే దేవ స్థానమునకు ఆసొమ్ము చెల్లింపవచ్చును.కొందఱు తమయిండ్ల ముందఱకు దేవుని ఉత్సవము వచ్చినప్పుడు హారతిచేయ నిత్య హారతికే సొమ్ము చెల్లించెదరు. అంతమాత్రముచేత దేవుడు అక్కడ ఆగవలెనను నుద్దేశ్యముగాదు. దేవుని ఉత్సవమవు చుండగా హారతిఇవ్వవలెను ఏర్పాటుగా నెఱుంగునది.

3.నిత్యఅర్చన.

నిత్యఅర్చనకు రు 42_లు దేవస్థానపు పారుపత్యదార్ ఖచేరిలో చెల్లించవలెను. తఱువాత తులసి మొదలగు ఖర్చులకు సంవత్సరము 1_కి రు 42–లుచో||ఏజంటు మూలకముగ గానిపై చెప్పిన ప్రకారము దేవస్థానమూలకముగ గాని జరిపింపన లెను.

నిత్యహరతి లేక నిత్య అర్చన జరిగించు యాత్రికుఁడు తమ ఏజెంట్లు ప్రతిదినము జరుపక సంవత్సరమునకు వేయవలసిన